Chiranjeevi: నర్సింగ్ యాదవ్ కొడుక్కి.. ‘మెగా’ కానుక..

Chiranjeevi మెగాస్టార్ చిరంజీవికి, కమెడియన్-కమ్-విలన్ నర్సింగ్ యాదవ్ కి మధ్య ప్రత్యేక అనుబంధం ఉండేది. దీంతో చిరంజీవి ఒకసారి నర్సింగ్ యాదవ్ కొడుక్కి మెగా గిఫ్ట్ ఇచ్చారు. చిరంజీవి తన సినిమాల షూటింగ్ స్పాట్ కి రాకముందే నర్సింగ్ యాదవ్ వెళ్లిపోయి అక్కడి ఏర్పాట్లన్నీ పర్యవేక్షించేవాడు. మెగాస్టార్ కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకునేవాడు. నర్సింగ్ యాదవ్ చిరంజీవికి పర్సనల్ అసిస్టెంట్ కాకపోయినా వ్యక్తిగతంగా ఎంతో అభిమానం చూపేవాడు. మెగాస్టార్ కూడా నర్సింగ్ యాదవ్ పట్ల అంతే శ్రద్ధ కనబరిచేవారు. ఈ రెండు కుటుంబాల మధ్య కూడా సాన్నిహిత్యం ఉంది. నర్సింగ్ యాదవ్ తన భార్యతో కలిసి చిరంజీవి ఇంటికి ఎన్నోసార్లు వెళ్లారు. నర్సింగ్ యాదవ్ సతీమణ చిత్ర మెగాస్టార్ కి ప్రతి సంవత్సరం రాఖీ కట్టేవారు.

ఒకసారి ఏమైందంటే..

నర్సింగ్ యాదవ్ కి కొడుకు పుట్టాడు. మూడు నెలల తర్వాత తమ వారసుణ్ని చిరంజీవికి చూపించి వద్దామని నర్సింగ్ యాదవ్ దంపతులు ఎప్పటిలాగే మెగా స్టార్ ఇంటికి వెళ్లారు. దీంతో ఆయన వెంటనే తన మేనేజర్ ని బయటికి పంపించి ఒక పెద్ద గోల్డ్ చైన్ ని తెప్పించి నర్సింగ్ యాదవ్ కుమారుడి మెడలో వేశారు. అది ఏడు తులాల కంటే ఎక్కువే బరువు ఉంటుంది. అప్పట్లోనే ఏడు తులాలంటే చాలా ఖరీదన్నట్లే లెక్క. మెగాస్టార్ సతీమణి సురేఖ కూడా చిత్రకి పసుపు బొట్టు ఇచ్చారు. నర్సింగ్ యాదవ్ ఫ్యామిలీతో చిరంజీవి ఫ్యామిలీ చాలా అన్యోన్యంగా, ఆప్యాయంగా మాట్లాడేవారు. మెగాస్టార్ లాంటి గొప్ప వ్యక్తి మా పట్ల ఇంత ప్రేమ చూపటం ఏంటి అని చిత్రకి ఆశ్చర్యంగా ఉండేది.

Narsingh Yadav wife Chithra about Chiranjeevi
Narsingh Yadav wife Chithra about Chiranjeevi

ఈ మధ్యే..

తెలుగు, తమిళ, హిందీ భాషల్లోని ఎన్నో సినిమాల్లో తనదైన నటనని ప్రదర్శించిన నర్సింగ్ యాదవ్ అటు అభిమానుల మనసులో, ఇటు మెగాస్టార్ మదిలో చెరగని ముద్ర వేశాడు. గత ఏడాది చివరి రోజున ఆఖరి శ్వాస విడిచాడు. దీంతో చిరంజీవి ‘ఆత్మీయుణ్ని కోల్పోయా’ అంటూ తీవ్ర ఆవేదన చెందారు. ఇన్నాళ్లూ ఎవరికీ తెలియన ఈ విషయాలని నర్సింగ్ యాదవ్ సతీమణి చిత్ర ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Advertisement