Naresh: నా భార్యకి డ్రైవర్‌తో ఎఫైర్: సీనియర్ నటుడు నరేష్ సంచలనం

NQ Staff - July 2, 2022 / 09:55 PM IST

Naresh: నా భార్యకి డ్రైవర్‌తో ఎఫైర్: సీనియర్ నటుడు నరేష్ సంచలనం

Naresh: సీనియర్ నటుడు నరేష్ వైవాహిక జీవితం అత్యంత వివాదాస్పదంగా మారింది. తన భార్య మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారు నరేష్. ఇంకోపక్క, నరేష్ సతీమణి రమ్య రఘుపతి మాత్రం, నరేష్ మీద సాధారణ ఆరోపణలతోనే సరిపెడుతున్నారు. అయితే, ఈ వ్యవహారంలో సినీ నటి పవిత్ర లోకేష్ కూడా దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటుండడం గమనార్హం.

Naresh Sensational Comments on his wife

Naresh Sensational Comments on his wife

‘మా అత్తగారు జీవించి వుంటే, నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు..’ అని రమ్య రఘుపతి ఆరోపిస్తోంటే, రమ్య ఓ ఛీటర్ అంటున్నాడు నరేష్. ఆమె చాలామందిని మోసం చేసిందనీ, లక్షల్లో డబ్బు ఎగ్గొట్టిందనీ, ఆ తలనొప్పులు తాను భరించానని నరేష్ చెప్పుకొచ్చాడు.

ఛీ, నరేష్ భార్య అలాంటిదా.?

ఏ భర్త కూడా తన భార్య మీద జగుప్సాకరమైన ఆరోపణలు చేయడు.. ఒకవేళ ఆమెను వదలించుకోవాలని చూసినాగానీ.! అయితే, నరేష్ మాత్రం చేస్తున్నాడు. తన భార్యకి, తన దగ్గర పనిచేసే డ్రైవర్‌తో అక్రమ సంబంధం వుందని ఆరోపించాడు నరేష్. ‘ఓసారి ఇంట్లో ఫంక్షన్ ఏర్పాటు చేస్తే, మేల్ క్యాబరే డాన్సరుని వెంట తీసుకొచ్చింది..’ అంటూ నరేష్ వ్యాఖ్యానించడం గమనార్హం.

ప్రశ్నించిన ప్రతిసారీ చెత్త వివరణలు ఇచ్చిందనీ, పరిస్థితి చెయ్యిదాటిపోయిందని భావించి ఆమెను దూరంగా పెట్టాననీ, విడాకులకు సిద్ధమయ్యాననీ నరేష్ అంటున్నాడు. నరేష్ మాటల్ని నమ్మేదెలా.?

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us