Malli Pelli : మళ్లీ పెళ్లితో నరేష్ కి లాభమా? నష్టమా?

NQ Staff - June 5, 2023 / 10:48 PM IST

Malli Pelli : మళ్లీ పెళ్లితో నరేష్ కి లాభమా? నష్టమా?

Malli Pelli : సీనియర్ నటుడు నరేష్ ఇటీవల మళ్లీ పెళ్లి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎంఎస్‌ రాజు దర్శకత్వం లో నరేష్ స్వయంగా మళ్లీ పెళ్లి సినిమాను నిర్మించిన విషయం తెల్సిందే. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మళ్లీ పెళ్లి సినిమాను 15 నుండి 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించారు.

నరేష్ మరియు పవిత్ర లోకేష్ మధ్య ఉన్న రిలేషన్ షిప్ ను ఈ సినిమాలో చూపించడం జరిగింది. అంతే కాకుండా నరేష్ మరియు రమ్య రఘుపతి మధ్య నడుస్తున్న కేసు గురించి కూడా చూపించడం జరిగింది. మొత్తానికి మళ్లీ పెళ్లి తెగ హడావుడి చేసింది. కానీ విడుదల తర్వాత తీవ్ర నిరాశ పరిచింది.

సినిమాకు కాస్త ఎక్కువగానే ఖర్చు చేసిన నరేష్ కు కాస్త అటు ఇటుగా లాభం లేకున్నా నష్టం మాత్రం రాలేదు అన్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమాకు వచ్చిన వసూళ్లు మరియు నాన్ థియేట్రికల్‌ రైట్స్ ద్వారా వస్తున్న మొత్తంతో నరేష్ కు నష్టం అయితే లేదు అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

కమర్షియల్‌ విషయాలు పక్కన పెడితే నరేష్ వ్యక్తిగతంగా ఈ సినిమా వల్ల చాలా సంతోషం పొంది ఉంటాడు. ఎందుకంటే బతికి ఉండగానే బయోపిక్ అన్నట్లుగా వచ్చింది. అంతే కాకుండా పవిత్ర లోకేష్ గురించి జనాలకు ఫుల్‌ క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది. కనుక నరేష్‌ కు ఈ సినిమా లాభాన్నే మిగిల్చింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us