Naresh : పవిత్ర మీ ఆస్తిని చూసి పడిందా.. నరేశ్ కు యాంకర్ సూటి ప్రశ్న..!

NQ Staff - May 29, 2023 / 09:27 AM IST

Naresh : పవిత్ర మీ ఆస్తిని చూసి పడిందా.. నరేశ్ కు యాంకర్ సూటి ప్రశ్న..!

Naresh : గత కొన్ని రోజులుగా సీనియర్ నరేశ్-పవిత్ర పేర్లు మార్మోగిపోతున్నాయి. ఇందుకు వీరు చేస్తున్న పనులే కారణం. వీరు చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారు. కానీ కొన్ని రోజుల క్రితమే దాన్ని కన్ఫర్మ్ చేశారు. 60 ఏండ్ల వయసులో నరేశ్ సహజీవనం చేయడం నిజంగా అందరికీ ఆశ్చర్యంగానే అనిపిస్తోంది.

పవిత్రకు కూడా దాదాపు 40 ఏండ్ల వయసు ఉంటుంది. ఇప్పటికే నరేశ్ కు మూడు పెండ్లిలు అయ్యాయి. ఇప్పుడు పవిత్రను నాలుగో పెండ్లి చేసుకుంటున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ జంటగా మళ్లీపెళ్లి సినిమాలో నటించారు. రీసెంట్ గా మూవీ విడుదలైంది. ఈ సందర్భంగా నరేశ్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

అయితే తాజాగా నరేశ్ ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన మాట్లాడుతుండగా యాంకర్ ఓ సూటి ప్రశ్న వేసింది. ఇప్పటికే మీకు మూడు పెండ్లిలు అయ్యాయి. ఇప్పుడు పవిత్రను నాలుగో పెండ్లి చేసుకుంటా అంటున్నారు. వీరంతా మిమ్మల్ని చూసి వస్తున్నారా లేక మీ ఆస్తిని చూసి వస్తున్నారా అని అడిగింది.

నరేశ మాట్లాడుతూ.. నా దగ్గర ఆస్తిని చూసి వచ్చిన వారు ఉన్నారు. ఆస్తిలేనప్పుడు వెళ్లిన వారు ఉన్నారు. ప్రేమకు, వ్యామోహానికి నాకు తేడా తెలుసు. కానీ పవిత్ర మాత్రం నిస్వార్థంగా ఉంది. ఆమె కేవలం నా కోసమే వచ్చింది. అందులో నాకు అదే నచ్చింది. అందుకే ఆమెను పెండ్లి చేసుకుంటున్నా అంటూ తెలిపాడు నరేశ్.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us