Naresh : మళ్లీపెళ్లి కృష్ణకు అంకితం చేస్తున్న నరేశ్.. దుమ్మెతిపోస్తున్న ఫ్యాన్స్..!
NQ Staff - May 29, 2023 / 04:36 PM IST

Naresh : సీనియర్ నరేశ్ ఈ నడుమ తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు. ఇందుకు కారణం ఆయన పవిత్ర లోకేష్ తో సహజీవనం చేయడమే. గతంలో ఆయనకు మూడు పెండ్లిలు అయ్యాయి. ఇప్పుడు నాలుగో పెండ్లికి రెడీ అయ్యారు. ప్రస్తుతానికి వీరిద్దరూ మళ్లీపెళ్లి అనే సినిమాలో నటించారు. వీరిద్దరి బయోపిక్ ఆధారంగా ఈ సినిమా వచ్చినట్టు తెలుస్తోంది.
ఇక ఈ మూవీ రిలీజ్ అయి మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా నరేశ్ సక్సెస్ మీట్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ పెళ్లి సినిమాను సూపర్ స్టార్ కృష్ణకు అంకింతం చేస్తున్నట్టు చెప్పారు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ జయంతి జరగనుంది.
ఈ సందర్భంగా ఆయనకు ఈ సినిమాను అంకింతం చేస్తానని నరేశ్ స్పష్టం చేశారు. రియల్ లైఫ్ లో అసలు బోల్డ్ కపుల్ అంటేనే కృష్ణ-విజయ నిర్మల గారే అంటూ తెలిపాడు నరేశ్. కాగా నరేశ్ ఇలా సినిమాను అంకింతం చేయడంపై కృష్ణ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు ఈ వివాదాస్పద మూవీని అంకింతం చేయడం ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఆ పవిత్రతో ఎఫైర్ పెట్టుకున్న నువ్వు.. ఆమెతో నటించిన సినిమాను మా హీరోకు అంకింతం చేయడం ఏంటయ్యా అంటూ కడిగి పారేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మీద ట్రోల్స్ కూడా బాగానే పెరుగుతున్నాయి.