R Narayana Murthy: నా ద‌గ్గ‌ర కోట్లున్నాయి, అద్దె కూడా క‌ట్టుకోలేనా.. ఎమోష‌న‌ల్ అయిన నారాయ‌ణ మూర్తి

R Narayana Murthy: పీపుల్ స్టార్ నారాయ‌ణ మూర్తి అంటే ప్ర‌జ‌ల‌లో అభిమానంతో పాటు కొంత జాలి ఉంటుంది. సోలోగా ఉంటూ కొన్ని ద‌శాబ్ధాలుగా ప్ర‌జ‌ల సేవ‌లో ఆయ‌న‌ ఉన్నారు.సినిమాల ద్వారా కూడా ప్ర‌జ‌ల‌లో చైత‌న్యం క‌లిగేలా నారాయ‌ణ మూర్తి సినిమాలు చేస్తుంటారు. విప్ల‌వ హీరోగా నారాయ‌ణ మూర్తి టాలీవుడ్‌లో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందాడు.

r narayana murthy
r narayana murthy

ఇటీవల సోషల్ మీడియాలో ఆయ‌న‌పై రకరకాల పుకార్లు షికారు చేసాయి. ఆయన ఆర్థికంగా చితికి పోయారని, ఉండటానికి సొంత ఇల్లు కూడా లేక హైదరాబాద్ శివార్లలో అద్దె ఇంట్లో ఉంటున్నారని వార్తలు వచ్చాయి. ‘రైతన్న’ సినిమా ప్రివ్యూ సందర్భంగా గద్దర్ మాట్లాడిన మాటలను కొంద‌రు వక్రీక‌రించి త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నార‌ని నారాయ‌ణ మూర్తి అన్నారు.

దాదాపు 40 సంవ‌త్స‌రాలుగా ఇండ‌స్ట్రీలో ఉంటూత‌న‌దైన శైలిలో సినిమాలు చేస్తున్న నారాయ‌ణ మూర్తి తాజాగా మీడియాతో మాట్లాడాడు. గద్దర్ తన గురించి ప్రేమతో, అభిమానంతో అలా చెప్పారే కానీ తాను రిచ్ అని నారాయణమూర్తి అన్నారు. అద్దె కట్టలేక ఇబ్బందులు పడుతున్నానన్న మాటల్లోనూ నిజం లేదని, తగిన స్వేచ్ఛ కోరుకునే తాను నగర శివార్లలో ఉంటున్నానని అన్నారు.

40 ఏళ్ల కెరీర్లో తాను కోట్లు సంపాదించానని.. తన వరకు సరిపడ దాచుకున్నానని.. మిగతాది సేవా కార్యక్రమాలకు ఇచ్చానని క్లారిటీ ఇచ్చాడు. నిజానిజాలు తెలుసుకోకుండా తనపై రాసిన అవాస్తవాలు చదివి చాలా బాధ పడ్డట్టు తెలిపాడు నారాయణ మూర్తి. నగరంలో ప్రయాణించడానికి తనకు ఆటోకి రోజుకు వెయ్యి రూపాయలు అవుతుందని, ఆ రకంగా ఆటోకే నెలకు 30 వేలు ఖర్చు చేస్తానని చెప్పారు. ప్రభుత్వ అధికారులు కొందరు గతంలో ఇల్లు ఇస్తానని చెప్పినా తాను తీసుకోలేదని అన్నారు.

సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లు నా మ‌న‌సుకు చాలా బాధ‌ను క‌లిగించాయి. ద‌య‌చేసి అలాంటి ప్రచారాలు చేయ‌కండి. గ‌తంలో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు చేసిన నాను బాగానే సంపాదించాను. అవ‌స‌ర‌మైతే నాకు సాయం చేసే స్నేహితులు ఉన్నారు. ఎవ‌రి సాయం కోర‌డం నాకు ఇష్టం ఉండ‌దు అని నారాయ‌ణ మూర్తి పేర్కొన్నారు.

ఆర్. నారాయణమూర్తి 1985లో స్నేహచిత్ర పతాకాన్ని స్థాపించి ‘అర్థరాత్రి స్వాతంత్రం’ మూవీతో దర్శక నిర్మాతగా మారారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఒకే పంథాలో సినిమాలను స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూనే ఉన్నారు.