NARAPPA: స్టార్ హీరో చిత్రంకు కరోనా దెబ్బ‌.. వాయిదా వేసిన‌ట్టు అధికారిక ప్ర‌క‌ట‌న చేసిన మేక‌ర్స్

క‌రోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన చిత్రాలు ఒక్కొక్క‌టిగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి. ఎగ్జ‌యిటింగ్ థ్రిల్ల‌ర్ `థాంక్ యూ బ్ర‌ద‌ర్‌` సినిమా ఆహాలో మే 7న డైరెక్ట్‌గా రిలీజ్ అవుతుంది. అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘థాంక్యూ బ్రదర్’ చిత్రాన్ని థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయాల‌నుకున్న‌ప్ప‌టికీ క‌రోనా వ‌ల‌న కుద‌ర‌క‌పోవ‌డంతో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు. ఇక ల‌వ్ స్టోరీ, ఆచార్య‌, ట‌క్ జగ‌దీష్‌, విరాట ప‌ర్వం వంటి చిత్రాల‌ను వాయిదా వేశారు.

ఇక మే 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘నారప్ప’ సినిమాని పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు మేకర్స్ అధికారకంగా వెల్లడించారు. త‌మిళ సూప‌ర్ హిట్‌ చిత్రం అసుర‌న్‌కు రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా వి క్రియేషన్స్ కలైపులి ఎస్.థాను సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కాని ప‌రిస్థితులు అనుకూలించాక ఈ మూవీని థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తాం అని అంటున్నారు మేక‌ర్స్.

Advertisement