Nara rohit: వంద తప్పులు పూర్త‌య్యాయి.. ఇక‌ వైసీపీ నాయ‌కుల భ‌ర‌తం ప‌డ‌తారు: నారా రోహిత్

Nara rohit: 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న చంద్రబాబు ఏ నాడు క‌న్నీరు పెట్ట‌లేదు. కాని శుక్రవారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన అవమానానికి కన్నీటిపర్యంతమయ్యారు. తన భార్యను రాజకీయాల్లోకి లాగి అత్యంత అవమానకరంగా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారని ఆవేదనతో ఏడ్చేశారు. ఇప్పటివరకు చంద్రబాబు విలపించిన సందర్భాన్ని ఎప్పుడూ టిడిపి నేతలు చూడలేదు.

Nara rohit
Nara rohit

వెక్కి వెక్కి ఏడవడంతో తెలుగు తమ్ముళ్ళు దిగ్భ్రాంతికి గురయ్యారు. వైసీపీ ప్రభుత్వ పాలన పై, సీఎం జగన్మోహన్ రెడ్డి పై నిప్పులు చెరుగుతున్నారు. బాబును ఏడ్పించిన వారిపై అంతకు అంత పగ తీర్చుకుంటామని తేల్చి చెబుతున్నారు. చంద్రబాబును సీఎం చేసి తీరుతామని పసుపు ప్రతిజ్ఞలు చేస్తున్నారు.

ఏ సభలో అయితే చంద్రబాబు అవమానించబడ్డారో ఆ సభలో ఆయన్ని రారాజుగా నిలబెట్టడం కోసం ప్రతిక్షణం శ్రమిస్తామని టిడిపి కార్యకర్తలు పసుపు ప్రతిజ్ఞలు చేయడం మొదలుపెట్టారు. ప్రతి టీడీపీ కార్యకర్త ఈ చాలెంజ్ ని స్వీకరిస్తారని ఆచరిస్తారని ఆశిస్తున్నాను అంటూ ఒక్కొక్కరుగా చంద్రబాబు కోసం పసుపు ప్రతిజ్ఞలు చేస్తున్నారు.

చంద్రబాబుకు జరిగిన అవమానంపై సినీ నటుడు నారా రోహిత్ స్పందించారు. పశువుల కంటే హీనంగా కొందరు నేతలు ప్రవర్తించారంటూ అధికార పార్టీ నేతలపై మండిపడ్డారు. ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అసెంబ్లీలో చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వరిని అసభ్యపదజాలంతో దూషించడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. విధానాలపై రాజకీయ విమర్శలు ఉండాలిగానీ.. కుటుంబ సభ్యులను అందులోకి లాగడం క్షమించరానిదన్నారు.

రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యం హక్కును దుర్వినియోగపరిచేలా నోటికొచ్చినట్టు మాట్లాడడం సరికాదన్నారు. అయినా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చంద్రబాబు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకోవడం వారి భ్రమే అవుతుందన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉన్నారని, అందుకే వారి మనుగడ సాగిందని అన్నారు.

nara rohit fire on ycp party
nara rohit fire on ycp party

శిశుపాలుడిలాగే నిన్నటితో వారి వంద తప్పులు పూర్తయ్యాయని, వారి అరాచకాన్ని ఉపేక్షించేది లేదని చెప్పారు. ప్రతి ఒక్క తెలుగు దేశం కార్యకర్త.. వైసీపీ దుశ్శాసనుల భరతం పడతారని రోహిత్ హెచ్చరించారు. ‘స్థాయిలేని వ్యక్తుల మధ్య రాజకీయాలు చేయాల్సి రావడం దురదృష్టకరం పెదనాన్న’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.