BALA KRISHNA: కూతురికి కంగ్రాట్స్ చెప్పిన బాల‌కృష్ణ‌.. ఎందుకో తెలుసా?

Samsthi 2210 - February 16, 2021 / 10:58 AM IST

BALA KRISHNA: కూతురికి కంగ్రాట్స్ చెప్పిన బాల‌కృష్ణ‌.. ఎందుకో తెలుసా?

BALA KRISHNA నంద‌మూరి తార‌క‌రామారావు న‌ట వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకొని ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాల‌కృష్ణ‌ వంద‌కు పైగా సినిమాలు చేశారు. చారిత్రాత్మ‌క‌, జాన‌ప‌ద‌, సాంఘిక,పౌరాణికం వంటి చిత్రాల‌తో ప్రేక్షకుల మ‌న‌సు గెలుచుకున్నారు. బాల‌య్య‌కు ప్ర‌త్యేక అభిమాన గ‌ణం ఉండ‌గా, ఆయ‌న సినిమాల కోసం ప్రేక్ష‌కులు క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తుంటారు. న‌టుడిగానే కాకుండా, ప్ర‌జా సేవ‌కుడిగా, బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆసుప‌త్రి చైర్మ‌న్‌గా బాల‌కృష్ణ అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ ప్ర‌జ‌ల గుండెల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు.

బాల‌కృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి కూడా అప్పుడ‌ప్పుడు త‌న తండ్రికి సంబంధించిన ప‌నుల‌లో పాలు పంచుకుంటూ ఉంది. తాజాగా ఆమెకు కీలక బాధ్యతలు అప్ప‌గించారు. ఇన్నాళ్ళు కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలు, ఎన్టీఆర్ ట్ర‌స్ట్ వ్య‌వ‌హారాలు చేసుకున్న బ్రాహ్మణి తన తండ్రి నందమూరి బాలకృష్ణ పర్యవేక్షణలో కొనసాగుతున్న ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ట్రస్ట్‌కు ఆమె బోర్డ్ మెంబర్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని త‌న ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా తెలియ‌జేసిన బాల‌కృష్ణ‌.. కూతురికి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

నా కుమార్తె బ్రాహ్మణిని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కుటుంబానికి స్వాగతిస్తున్నాను. ట్ర‌స్ట్ బోర్డ్ స‌భ్యురాలిగా బాధ్య‌త చేప‌ట్టిన ఆమెకు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. పీడియాట్రిక్ క్యాన్సర్‌తో పోరాడుతున్న అతి చిన్న యోధులుకు నేను సెల్యూట్ చేస్తున్నాను. చిన్నారులకు మంచి ఆరోగ్యం మరియు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటంలో విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను అని బాల‌కృష్ణ త‌న సోష‌ల్ మీడియాలో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ‌.. బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో అనే సినిమా చేస్తుండ‌గా, ఈ మూవీ బీబీ 3 అనే టైటిల్‌తో ప్ర‌చారం జ‌రుపుకుంటుంది. మే 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ తో పాటు టైటిల్ మ‌హా శివ‌రాత్రి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు టాక్.

I welcome my beloved daughter Mrs Nara Brahmani to our Basavatarakam Indo American Cancer Hospital & Research Institute…

Posted by Nandamuri Balakrishna on Monday, 15 February 2021

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us