NANI : శ్యామ్ సింగ రాయ్ మూవీపై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన నాని
Samsthi 2210 - February 21, 2021 / 05:17 PM IST

NANI : ప్రతి ఏడాది రెండు మూడు సినిమాలతో అలరించే నాని గత ఏడాది కరోనా వలన పెద్దగా సందడి చేయలేకపోయాడు. నాని నటించిన వి అనే మల్టీ స్టారర్ చిత్రం గత ఓటీటీలో విడుదల కాగా, ఇది పెద్దగా అలరించలేకపోయింది. అయితే ఈ ఏడాది మూడు చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్న నాని ముందుగా టక్ జగదీష్ చిత్రంతో సందడి చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్స్ విడుడదల కాగా, టీజర్‌ని త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇక మూవీ ఏప్రిల్ 23న విడుదల కానుంది.
నాని ‘శ్యామ్ సింగ రాయ్’ అనే వైవిధ్యమైన టైటిల్‌తో సినిమా చేస్తుండగా, ఈ చిత్రాన్ని ‘టాక్సీవాలా’ చిత్ర దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు నాని. మూవీ ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 24న విడుదల కానుందని తెలియజేశారు. పాత కాలంలో ఉండే టైప్ మెషీన్‌ను ఈ వీడియోలో వాడుకున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే నాని.. అంటే సుందరానికి అనే టైటిల్‌తోను ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.
💥#ShyamSinghaRoy pic.twitter.com/RVrh6rVTb2
— Nani (@NameisNani) February 21, 2021