Natural Star Nani: ఓటీటీకి నాని నో చెప్పాడు, ప‌రిస్థితులు అర్ధం చేసుకున్నాక ఓకే అన్నాడు..!

Natural Star Nani: నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శివ నిర్వాణ‌ తెరకెక్కించిన కుటుంబ కథా చిత్రం ‘టక్‌ జగదీష్‌‌’. ఈ సినిమా రిలీజ్ విష‌యంలో కొద్ది రోజులుగా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. కరోనా వ‌ల‌న వాయిదా ప‌డ్డ ఈ సినిమాను ముందుగా థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయాలి అనుకున్నా, ఇప్ప‌టికీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌క‌పోవడంతో ఓటీటీలో విడుద‌ల చేసేందుకు సన్న‌ద్ధ‌మయ్యారు.

Nani said no to OTT and said ok after understanding the circumstances ..!
Nani said no to OTT and said ok after understanding the circumstances ..!

సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిండంతో థియేటర్ల యాజమాన్యం నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తే.. ఆ తర్వాత విడుదల అయ్యే నాని సినిమాలను థియేటర్లలో విడుదలు చేయము అంటూ థియేటర్ యాజమాన్యాలు ప్రకటించారు. అనంత‌రం తెలంగాణ థియేటర్ల సంఘం చ‌ర్చించి మ‌రో ప్ర‌క‌ట‌న ఇచ్చింది.

Nani said no to OTT and said ok after understanding the circumstances ..!
Nani said no to OTT and said ok after understanding the circumstances ..!

ట‌క్‌ జగదీష్’ సినిమాతో ఎన్నో అంచనాలు ఉన్నాయి అని.. అయితే అది ఓటీటీలో విడుదల చేయడం బాధ కలిగించింది కానీ, ఎవరిని వేధించాలనో లేదా వేరే ఉద్దేశం లేదని థియేటర్‌ల సంఘం పేర్కొంది. ఒకవేళ తమ ఎగ్జిబిటర్ల వల్ల ఎవరైన హర్ట్ అయి ఉంటే దయచేసి క్షమించాలి అంటే వాళ్లు తాజాగా విడుదల చేసిన ప్రకటన చేసింది. వారు విడుద‌ల చేసిన కొన్ని గంట‌ల‌లో నిర్మాణ సంస్థ కూడా స్టేట్ మెంట్ విడుద‌ల చేసింది.

Nani said no to OTT and said ok after understanding the circumstances ..!
Nani said no to OTT and said ok after understanding the circumstances ..!

సినిమా మీద ప్యాష‌న్‌తో మంచి సినిమాలు తీయాల‌నే నిర్మాణ రంగంలోకి వ‌చ్చాం. ట‌క్ జ‌గ‌దీష్ చిత్రం కోసం రెండున్న‌రేళ్లు ఆగాం. ఇప్ప‌టికీ ప‌రిస్థితులు మార‌లేదు. నానికి కూడా ఓటీటీలో విడుద‌ల చేయ‌డం ఇష్టం లేదు. ఆయ‌న నిర్మాత‌ల బాధ‌లు, ప్ర‌స్తుత ప‌రిస్థితులు అర్ధం చేసుకొని ఓటీటీ విడుద‌లకు ఒప్పుకున్నారు.

ముందు నుండి మేము థియేట‌ర్‌లోనే విడుద‌ల చేయాల‌ని భావించాం. కాని కుద‌ర‌లేదు. హీరో, ద‌ర్శ‌కులు మా పరిస్థితుల‌ని అర్ధం చేసుకున్నారు. మీరు కూడా అర్ధం చేసుకొని మాకు అండ‌గా నిలుస్తార‌ని భావిస్తున్నాం అని చిత్ర నిర్మాత‌లు షైన్ స్క్రీన్స్ ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. దీంతో ట‌క్ జ‌గ‌దీష్ ఓటీటీలోనే విడుదల కావ‌డం క‌న్‌ఫాం అని తేలింది.