Nani: ద‌స‌రాకు అదిరిపోయే గిఫ్ట్ అందించ‌బోతున్న నాని.. ఏంటో తెలుసా?

Nani: నేచుర‌ల్ స్టార్ నాని ఏడాదికి మూడు నాలుగు సినిమాల‌తో సంద‌డి చేసేవాడు. కాని క‌రోనా వ‌ల‌న కాస్త జోరు త‌గ్గించాడు.రీసెంట్‌గా ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసిన నాని.. మరో రెండు చిత్రాలను సెట్స్ మీదకు తీసుకొచ్చారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న‌ ”శ్యామ్ సింగ రాయ్ చిత్రం కలకత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందే హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ కాగా, ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

నాని ‘అంటే.. సుందరానికి’ అనే కామెడీ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రారంభించాడు. ‘మెంటల్ మదిలో’ ‘బ్రోచేవారెవరురా’ ఫేం వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా సెట్స్ పై ఉంది. ఈ క్రమంలో లేటెస్టుగా నాని మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 15న మధ్యాహ్నం 1:53 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను రివీల్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి నాని ఆసక్తికరమైన ప్రీ-లుక్ పోస్టర్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

పోస్ట‌ర్‌లో బ్లాక్ థీమ్ లో ఓ పొగ రైలు ను ఇందులో చూడొచ్చు. ఈ నెల 15 నుంచి ఎస్ట్రాక్షన్ (వెలికితీత) ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇది కూడా నాని కెరీర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్న మూవీ అని అర్థం అవుతోంది. Nani29 చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ సంస్థలో ప్రస్తుతం రానా దగ్గుబాటి తో ‘విరాటపర్వం, రవితేజ హీరోగా ‘రామరావు ఆన్ డ్యూటీ, శర్వానంద్ తో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వంటి సినిమాలు రూపొందుతున్నాయి.