Nani: ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన హీరో నాని

Nani: కరోనా కారణంగా ఎంతోమంది ప్రాణాలను ఒంటి చేత్తో రక్షించారు డాక్టర్లు. వారి ప్రాణాలను పణంగా పెట్టి.. ఇంట్లో వాళ్ళను కూడా దరికి రానివ్వకుండా పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడ్డారు. ఇంట్లో వాళ్ళు కూడా దగ్గరకు రావడానికి ఆలోచించిన సమయంలో ప్రజల ప్రాణాలకు మేమున్నామని చేయి అందించారు. అలాంటి మహోన్నత వ్యక్తులకు మనం ఏం ఇచ్చి రుణం తీర్చుకోగలం. దేశాన్ని రక్షించే సైనికుల్లా మహమ్మారి పై యుద్ధం చేశారు ఫ్రంట్ లైన్ వర్కర్స్. వీరందరికీ ఎంతో మంది సెలబ్రిటీస్ చేతులెత్తి నమస్కరించారు.

ఇంకొంత మంది వారి సేవకు తగిన విధంగా సపోర్ట్ గా నిలిచారు. ఈ క్రమంలో టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఓ అద్దిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేశారట. ప్రజలను కాపాడటం కోసం డాక్టర్లు, నర్సులు, పోలీసులు, మీడియా ఇలా అందరూ ముందు వరుసలో నిలబడి సెల్యూట్ చేపించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.

అలాంటి వారి కోసం ఇప్పటికీ ఇంకా కరోనా తో పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన డాక్టర్లు, హెల్త్ వర్కర్స్, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పొలీసులు, మీడియా వారికి నాని ఓ స్పెషల్ సర్ప్రైజ్ అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టులో నాని.. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ కోసం అంటూ మ్యూజిక్‌, డాక్టర్‌ ఎమోజీలకు లవ్‌ ఎమోజీలను యాడ్ చేసి ఫొటో షేర్‌ చేశాడు. ఈ ఫొటోలో నాని కెమెరాను పట్టుకుని డిస్‌ప్లేను చూస్తున్నారు. తనతో మరికొందరూ కెమెరా వైపే సిరీయస్‌గా చూస్తున్నారు. అది చూసిన నెటిజన్లు నాని ఏం ప్లాన్ చేశారో తెలియక తెగ ఎక్సైట్ అవుతున్నారు. ఈ పోస్ట్ పై ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. ఏది ఏమైనా నాని ప్లాన్ చేస్తున్నారా అని ఉత్సాహం చూపిస్తున్నారు. మరీ ఆ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.