Nani : నాని – నాగ చైతన్య సినిమాలకి లైన్ క్లియర్..మబ్బులన్ని విడిపోయాయి ..!

Nani : నాని – నాగ చైతన్య సినిమాలకి సంబంధించి ఈ మధ్య ఒక విషయంలో రూమర్స్ బాగా స్ప్రెడ్ అయ్యాయి. రెండు సినిమాల రిలీజ్ డేట్ విషయంలో క్లాష్ వచ్చిందని కావాలనే మేకర్స్ పోటీపడి ఒకే డేట్ ని ఫిక్స్ చేసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చి వైరల్ గా మారాయి. నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహుగారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇంతకముందు నాని – డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో నిన్నుకోరి సినిమా వచ్చి భారీ హిట్ గా నిలిచింది. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం మజిలీ బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించింది. దాంతో నాని టక్ జగదీష్ మీద భారీ అంచనాలున్నాయి. కాగా ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలని జరుపుకుంటోంది. ఇక అక్కినేని నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టీజర్ తో లవ్ స్టోరీ సినిమా మీద ప్రేక్షకుల్లో బజ్ బాగానే క్రియేటయింది.

Nani : అసలు విషయం మేకర్స్ కి తెలీకుండా జరిగిందట..!

అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ ఒకటే కావడం తో ఆసక్తికరమైన చర్చలు సాగాయి. ఒకరికొకరు పంతానికి ఒకే డేట్ లాక్ చేసుకున్నారని అన్నారు. అయితే అసలు విషయం మేకర్స్ కి తెలీకుండా జరిగిందట. అయితే ఈ విషయాన్ని ఇద్దరు హీరోలు కలిసి నిర్మాతలని పరస్పరం అంగీకారంతో డేట్స్ మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నాగ చైతన్య ‘లవ్ స్టొరీ’ సినిమాని ఏప్రిల్ 16న.. నాని ‘టక్ జగదీష్’ సినిమాని ఏప్రిల్ 23న విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారట. కాగా రిలీజ్ డేట్ మారిన సినిమా కి సంబంధించిన కొత్త డేట్ ని త్వరలో ప్రకటించనున్నట్టు సమాచారం.

Advertisement