Tuck Jagadish: “ట‌క్ జ‌గ‌దీష్” గా మాస్ అండ్ పవర్ ఫుల్ రోల్ లో అదరగొట్టిన నాని

Tuck Jagadish: సాధార‌ణంగా నాని సినిమాలంటే చాలా ఫ‌న్నీగా, కాస్త ఎమోష‌న్స్‌తో ఉంటాయి. సంవ‌త్స‌రానికి మూడు నాలుగు సినిమాల‌తో సంద‌డి చేసే నాని ఇప్పుడు క‌రోనా వ‌ల‌న కొంత శాంతించాడు. గ‌త ఏడాది క‌రోనా వ‌ల‌న త‌ను న‌టించి వి చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేశాడు.ఇక ఈ ఏడాది ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. సెప్టెంబ‌ర్ 10న వినాయ‌క చవితి శుభాకాంక్ష‌ల‌తో ట‌క్ జ‌గ‌దీష్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల కానుంది.

Nani Mass Role in tuck Jagadish movie
Nani Mass Role in tuck Jagadish movie

ట‌క్ జ‌గ‌దీష్ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ , సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ లో నాని మునుపెన్నడూ లేని విధంగా చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. భూదేవి పురం ఊరి చుట్టూ ఈ చిత్రం కథ కొనసాగుతుంద‌ని ట్రైల‌ర్‌ని చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది.

‘భూదేవిపురం గురించి మీకో కథ చెప్పాలి’ అంటూ వీరేంద్ర అనే విలన్ గా డేనియల్ బాలాజీ ని చూపించడంతో ఈ ట్రైలర్ ప్రారంభించారు . ఫ‌స్ట్ ఫ్రేమ్‌తోనే ఆస‌క్తిని క‌లిగించారు. ‘ఆ వీరేంద్రకి భయపడకుండా జనం కోసం ఎవరో ఒకరు నిలబడాలి కదా’ అని జగపతిబాబు అనగానే నానిని పరిచయం చేసిన షాట్‌ అభిమానులకి మాంఛి కిక్‌ ఇచ్చేలా ఉంది. నీలం రంగు చొక్కా.. నల్ల కళ్లద్దాలతో ‘టక్‌ జగదీష్‌’గా నాని ఇచ్చిన ఎంట్రీ ఫ్యాన్స్‌కి జోష్ క‌లిగించింది.

ఫ్యామిలీని పిచ్చిగా ప్రేమించే జగదీష్ నాయుడు అనే యువకుడి కథ ఆధారంగానే సినిమా రూపొందిన‌ట్టు తెలుస్తుంది.బంధాలు, అనుబంధాలు, ఆప్యాయ‌త‌ల న‌డుమ హ్యాపీగా ఉన్న ఓ కుటుంబం పెద్ద మ‌ర‌ణించిన త‌ర్వాత అన్న‌ద‌మ్మ‌లు మ‌ధ్య ఎలాంటి ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకుంటాయి, భావోద్వేగాలు ఎలా ఉంటాయ‌ని ఆస‌క్తిగా చూపించారు.

అన్నదమ్ములైన జగపతి బాబు, నాని మధ్య సాగే సంభాషణలు ట్రైలర్‌కే ప్రధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ‘చిన్నప్పుడు నాకో మాట చెప్పావ్‌ గుర్తుందా? నా కుటుంబం ఓడిపోతే నేను ఓడిపోయినట్టే’, ‘భూ కక్షలు లేని భూదేవిపురం చూడాలనేది మా నాన్న కోరిక. ఇప్పుడది నా బాధ్యత’ అని నాని చెప్పిన మాటలు సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. జగదీష్ తండ్రిగా నాజర్ కనిపిస్తుండగా.. అన్న బోసుగా జగపతిబాబు నటించారు.

నాని ప్రేయసి గుమ్మడి వరలక్ష్మిగా రీతూ వర్మ నటించగా.. మరదలి పాత్రలో ఐశ్వర్య రాజేష్ కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటుగా ఈ సినిమాలో యాక్షన్ కూడా కావాల్సినంత ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. భూకక్షలు లేని భూదేవి పురాన్ని చూడాలనే తన తండ్రి కోరికను నెరవేర్చే బాధ్యత తీసుకున్న హీరో జీవితంలో ఎలాంటి మ‌లుపులు చోటు చేసుకుంటాయ‌నేది సినిమాలో మ‌రింత ఆస‌క్తిగా చూపించ‌నున్నారు.

‘అయినోళ్ళ కంటే ఆస్తులు పొలాలు ఎక్కువ కాదు.. రక్తసంబంధం విలువ తెలుసుకో’ వంటి డైలాగ్స్ అలరిస్తున్నాయి. మొత్తం మీద డైరెక్టర్ శివ నిర్వాణ టేకింగ్ నేచుర‌ల్ యాక్టింగ్‌, గోపీ సుందర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్,ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫీతో సినిమా చాలా అద్భుతంగా ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. ‘టక్ జగదీష్’ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నాయని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

‘టక్ జగదీష్’ చిత్రంలో సీనియర్ నరేష్ , ప్రియదర్శి , తిరువీర్ , రోహిణి, ప్రవీణ్ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. నేపథ్య సంగీతం కోసం గోపీ సుందర్ ని తీసుకున్నారు. ‘నిన్నుకోరి’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నాని – శివ నిర్వాణ కాంబోలో వస్తోన్న టక్ జగదీష్ చిత్రంలో భూదేవిపురం కథేంటి? టక్‌ జగదీష్‌ అనుకున్నది సాధించాడా? అనే దానిపై పూర్తి క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగ‌క త‌ప్ప‌దు.