Nani : నానితో పోటీ పడి పరువు తీసుకున్న యాంకర్.. ఇంటర్వ్యూ మధ్యలో ఆ పని..!
NQ Staff - March 11, 2023 / 05:06 PM IST

Nani : నేచురల్ స్టార్ నాని మొదటిసారి పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఆయన హీరోగా వస్తున్న మూవీ దసరా. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం నాని రీసెంట్ గా పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. తాజాగా ఆయన చెన్నైకి వెళ్లారు.
అక్కడ లిటిల్ టాక్స్ అనే యూట్యూబ్ ఛానెల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా నాని తాను దసరా మూవీలో బాటిల్ ఎత్తి దించుకుండా తాగే సీన్ గురించి వివరించారు. అయితే యాంకర్ ఓ ఛాలెంజ్ చేసింది. మీరు సినిమాలో మందు బాటిల్ ను చేత్తో ప్టటుకుండా తాగినట్టే ఇప్పుడు మనం కూడా చేద్దామా అని అడిగింది.
బాటిల్ ఎత్తగానే..
దాంతో నాని కూడా సరే అన్నాడు. ఇంతలోనే రెండు కూల్ డ్రింక్స్ ను తెప్పించింది యాంకర్. దాంతో ఆ కూల్ డ్రింక్ ను ఎలా తాగాలో నాని వివరించాడు. సరే అని ఇద్దరూ ఒకేసారి బాటిల్ ఎత్తారు. కానీ యాంకర్ మాత్రం కొద్దిగా తాగగానే మొత్తాన్ని బయటకు కక్కేసింది. తనతో కాదంటూ ఓడిపోయింది.
కానీ నాని మాత్రం అలవాటు ప్రకారంగా గడగడా తాగేశాడు. దాంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా కూడా నీకు చేత కాకపోతే ఎందుకు ఇలాంటి సవాళ్లు అంటూ ఆమె మీద పంచులు వేసేస్తున్నారు.
Ee challenge lo @NameisNani anna ni odinche vaallu undaremo 🤣#Dasara #DasaraOnMarch30thpic.twitter.com/55iLsz1NLN
— Sahithi 💫 (@sahithi_18) March 10, 2023