Nani : నాని పేరు చెప్పుకోవడానికి టాలీవుడ్ వస్తున్న మరో హీరోయిన్ ..!

Nani : నాని నేచురల్ స్టార్ గా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద నాని మినిమం గ్యారెంటీ హీరో. నాని తో సినిమా తీసిన నిర్మాత సేఫ్ గా ఉంటాడు. ఆర్ధికంగా నష్టపోడు. అందుకే నాని హిట్ అండ్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. వి తర్వాత నాని స్పీడ్ మరింత పెరిగింది. ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నాని నటిస్తున్నాడు. ఆ సినిమాలలో టక్ జగదీష్ టాకీ పార్ట్ కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ కూడా కాబోతోంది. రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

nani-another-heroine-going-to-be-introduced-in-nanis-new-project
nani-another-heroine-going-to-be-introduced-in-nanis-new-project

ఇక టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో శ్యాం సింగ్ రాయ్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా సాయి పల్లవి, ఉప్పెన ఫేం కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే నాని సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయిన అమ్మాయి.. నాని జపం చేస్తుంటుందన్న సంగతి తెలిసిందే. నాని నెచురల్ పర్ఫార్మర్ అని పొగిడేసే హీరోయిన్స్ ఉన్నారు. ఇండస్ట్రీలో కూడా నాని సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన అమ్మాయికి మంచి లైఫ్ ఉంటుందని అంటారు.

Nani : మలయాళంలో ఈ బ్యూటీకి మంచి పాపులారిటీ ఉంది.

ఇప్పుడు నాని పేరు చెప్పుకోవడానికి మరో బ్యూటిఫుల్ హీరోయిన్ తయారవుతోంది. ఆ అమ్మాయే ‘నజ్రియా ఫహాద్. ‘ అంటే సుందరానికి ‘ అన్న సినిమాలో నాని నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాని అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమాకి మెంటల్ మదిలో..బ్రోచేవారెవరురా సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా నజ్రియా టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. ఇప్పటికే మలయాళంలో ఈ బ్యూటీకి మంచి పాపులారిటీ ఉంది. అలాగే తమిళంలో కూడా హిట్ సినిమాలు చేసింది. ఇప్పుడు ఈ టాలెంటెడ్ హీరోయిన్ నాని సినిమాతో టాలీవుడ్ కి వస్తోంది. చూడాలి మరి ఇక్కడ తన సత్తా చాటుతుందా లేదా ..!

Advertisement