Nandini Roy : వామ్మో నందినీ రాయ్.! మోకాళ్ళ సాయంతో తిరుపతి కొండపైకెక్కిన బ్యూటీ.!

NQ Staff - October 18, 2022 / 11:46 PM IST

Nandini Roy : వామ్మో నందినీ రాయ్.! మోకాళ్ళ సాయంతో తిరుపతి కొండపైకెక్కిన బ్యూటీ.!

Nandini Roy : ఏం మొక్కుకుందోగానీ, ఏకంగా మోకాళ్ళ మీద తిరుపతి – తిరుమల మెట్ల మార్గంలో వెళ్ళింది సినీ నటి నందినీ రాయ్. బిగ్ బాస్ ఫేమ్ నందినీ రాయ్ పలు సినిమాల్లో నటించింది.. పలు వెబ్ సిరీస్‌లలో కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తిరుపతికి వెళ్ళింది. మోకాళ్ళ మీద తిరుమల కొండ మెట్లెక్కుతున్న వైనాన్ని సోషల్ మీడియా వేదికగా వీడియో రూపంలో పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చింది నందినీ రాయ్. మామూలుగా మెట్లెక్కడమే చాలా చాలా కష్టం.

కానీ, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి మీద భక్తితో వేలాది మంది భక్తులు తిరుమలకు కాలి నడక మార్గంలో వెళుతుంటారు.
మోకాళ్ళ సాయంతో మెట్లెక్కడం.. దేనికోసం.?  ఏదో బలమైన కోరిక కోరుకుని వుండాలి నందినీ రాయ్.. అంటూ ఆమె పోస్ట్ చేసిన వీడియో చూసి కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ‘అబ్బో, నీలో ఈ యాంగిల్ కూడా వుందా..’ అంటూ మరికొందరు వెటకారం చేస్తున్నారు.
ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ అండ్ వైల్డ్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసే నందిని రాయ్, ఇలా భక్తితో.. మోకాళ్ళతో మెట్లెక్కి.. ఆ వీడియో పోస్ట్ చేయడమంటే చిన్న విషయం కాదు.

దీన్ని పబ్లిసిటీ కోణంలో చూడాలా.? భక్తి కోణంలో చూడాలా.? అని చాలామందికి డౌటానుమానం వస్తోందనుకోండి.. అది వేరే విషయం.
సినీ తారలంటే చాలా చాలా సుకుమారంగా వుంటారని అంతా అనుకుంటారు. అందులో నిజం లేకపోలేదు. కానీ, నందినీ రాయ్ మాత్రం ఘటికురాలే సుమండీ.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us