Nandini Rai: మొక్క‌ల మ‌ధ్య అందాల ఆర‌బోత‌కు దిగిన బిగ్ బాస్ భామ‌

Nandini Rai: అందాల ముద్దుగుమ్మ‌లు అదిరిపోయే అందాల‌తో కేక పెట్టిస్తున్నారు. చాలా కాలం క్రితమే హీరోయిన్‌గా పరిచయం అయిన నందినీ రాయ్ .. ఎన్నో సినిమాలు చేసినా గుర్తింపును మాత్రం దక్కించుకోలేకపోయింది. తన అందచందాలతో సోషల్ మీడియాలో మాత్రం ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా నందినీ రాయ్ శృతి మించిన హాట్ షో చేసింది.

Nandini Rai Latest Stills Mesmerizes
Nandini Rai Latest Stills Mesmerizes

హైదరాబాదీ బ్యూటీ నందినీ రాయ్ ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘మాయ’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. ఈ క్రమంలోనే ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘సిల్లీ ఫెలోస్’ వంటి చిత్రాల్లో నటించింది. హీరోయిన్‌గా చేసినా నందినీ రాయ్‌కు పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ, బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె కెరీర్‌కు ఒక్కసారిగా ఊపొచ్చింది.

Nandini Rai Latest Stills Mesmerizes
Nandini Rai Latest Stills Mesmerizes

సుదీర్ఘమైన కెరీర్‌లో తెలుగులో సినిమాలు చేయకున్నా.. మిగిలిన భాషల్లో మాత్రం ఛాన్స్‌లు అందుకుంటోంది నందినీ రాయ్. ఇందులో భాగంగానే ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్‌లలో సైతం నటిస్తోంది. అయితే, హీరోయిన్‌గా అవకాశాలు సన్నగిల్లడంతో సపోర్టింగ్ క్యారెక్టర్లు సైతం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సతీష్ వేగేశ్న తెరకెక్కించిన ‘కోతి కొమ్మచ్చి’ అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది.

Nandini Rai Latest Stills Mesmerizes
Nandini Rai Latest Stills Mesmerizes

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. నందినీ రాయ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తోంది. అంతేకాదు, ఆ మధ్య లైవ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ఓ టాలీవుడ్ డైరెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

నందినీ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే గ్లామర్ ట్రీట్ చేస్తూ ఓ ఫొటోను షేర్ చేసింది. మొక్క‌ల మధ్య తొడ అందాలు ఆర‌బోస్తూ హాట్ షో చేసింది. శృతి మించిన ఈ హాట్ షోకు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఈ ఫొటో తెగ వైరల్ అయిపోతోంది.