Jr NTR : నందమూరి ఇంట్లో వేడుకకి ఎన్టీయార్‌ని దూరం పెట్టిన ఎన్టీయార్.?

NQ Staff - September 27, 2022 / 02:46 PM IST

Jr NTR : నందమూరి ఇంట్లో వేడుకకి ఎన్టీయార్‌ని దూరం పెట్టిన ఎన్టీయార్.?

Jr NTR : ఇది చాన్నాళ్ళ క్రితం జరిగిన ఓ వేడుకకి సంబంధించిన అంశం. నందమూరి కుటుంబంలో ఓ ఫంక్షన్ జరిగింది. చాలా పెద్ద ఫంక్షన్ అది. అప్పటికి నందమూరి కుటుంబంతో జూనియర్ ఎన్టీయార్‌కి అంత సత్సంబంధాలు లేవు. ఆ కుటుంబానికి జూనియర్ ఎన్టీయార్ చాలా దూరంగా వుండేవాడు.

హీరోగా అప్పుడప్పుడే యంగ్ టైగర్ నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న రోజులవి. నిజానికి, అప్పటికే ఓ పెద్ద హిట్ కొట్టేసి వున్నాడు కూడా. అయినాగానీ, నందమూరి కుటుంబంలోకి యంగ్ టైగర్‌కి నేరుగా ఎంట్రీ లేదని అప్పట్లో గాసిప్స్ వినిపించేవి.

ఎన్టీయార్‌ని అడ్డుకున్న ఆ ఎన్టీయార్ ఎవరు.?

ఆ వేడుకకి హరికృష్ణ తనయుడి హోదాలో యంగ్ టైగర్ ఎన్టీయార్ హాజరయ్యేందుకు వెళితే, ఎన్టీయార్ అతని అడ్డుకున్నాడట. ఆ ఎన్టీయార్ ఎవరో కాదు నందమూరి తారకరత్న అట. బాలకృష్ణే స్వయంగా తారకరత్నని పురమాయించి, ఎన్టీయార్‌ని అవమానించేలా చేశాడని అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది.

ఆ ఘటనపై హరికృష్ణ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడంటారు. ఎలాగైతేనేం, ఆ తర్వాత క్రమంగా నందమూరి కుటుంబంలో యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి తగిన గౌరవం దక్కడం ప్రారంభ మయ్యింది.

అయితే, యంగ్ టైగర్ ఎన్టీయార్ విషయంలో తనకెప్పుడూ వేరే భావం లేదనీ, అప్పట్లో జరిగిందంతా కేవలం దుష్ప్రచారమేనీ అంటాడు తారకరత్న. కానీ, ‘ఎన్టీయార్ అంటే అప్పట్లో స్వర్గీయ ఎన్టీయార్.. ఇప్పుడు ఈ నందమూరి తారక రత్న..’ అంటూ ఒకింత అగ్రెసివ్‌గానే వుండేవాడు తారకరత్న, కెరీర్ తొలి నాళ్ళలో.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us