MULTI STARRER: నంద‌మూరి హీరోల‌తో మ‌ల్టీ స్టార‌ర్ ప్లాన్.. ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్న అభిమానులు

MULTI STARRER ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌ల్టీ స్టార‌ర్ ట్రెండ్ నెల‌కొంది. రామ్ చ‌రణ్‌ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ అనే మ‌ల్టీ స్టార‌ర్ రూపొందుతుండ‌గా, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- రానా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అయ్య‌ప్ప‌నుమ్ కోషియమ్ చిత్ర రీమేక్ తెర‌కెక్కుతుంది. ప‌లు చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇక ఎప్పటి నుండో నంద‌మూరి ఫ్యామిలీకి సంబంధించిన మ‌ల్టీ స్టార‌ర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో అనీల్ రావిపూడి.. బాల‌కృష్ణ‌, క‌ళ్యాణ్ రామ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఓ మ‌ల్టీ స్టార‌ర్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

క‌ళ్యాణ్ రామ్ ఇప్ప‌టికే బాల‌య్య న‌టించిన ప‌లు చిత్రాల‌లో కీల‌క పాత్ర పోషించారు. ఇప్పుడు మాత్రం ప్ర‌ధాన పాత్ర‌లో పోషించి అల‌రించ‌నున్నాడ‌ట‌. ఈ చిత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా చేస్తుంద‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ‌.. బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న అఖండ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్త‌య్యాక అనీల్ రావిపూడి సినిమా మొద‌లు పెట్ట‌నున్న‌ట్టు తెలుస్తుంది. అలానే గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలోను బాల‌కృష్ణ ఓ సినిమా చేయ‌నున్నాడు. రానున్న రోజుల‌లో బాల‌య్య వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు పసందైన వినోదాన్ని పంచ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Advertisement