NTR: ఎన్టీఆర్- క‌ళ్యాణ్ రామ్ స‌తీమ‌ణులు ఒకే ఫ్రేములో.. చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్న ఫొటో

విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు న‌ట వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకొని ఆ ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. ఇందులో బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ మాత్ర‌మే నిల‌బ‌డ్డారు. క‌ళ్యాణ్ రామ్ నిర్మాత‌గా అప్పుడ‌ప్పుడు హీరోగా అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే నంద‌మూరి హీరోల‌లో చాలా అనుబంధంతో ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ఉంటార‌నే సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. ఎక్క‌డికి వెళ్లిన వీరంద‌రు జంట‌గా వెళ్ల‌డం ఎంతో అన్యోన్యంగా ఉండ‌డం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. ఇక వేడుక‌ల‌లో త‌మ్ముడిపై తెగ ప్రేమ‌ను అన్న కురిపిస్తుంటే, అన్న‌పై అంతే ప్రేమ‌ను త‌మ్ముడు కురిపిస్తుంటారు.

అయితే ఈ నంద‌మూరి హీరోలు ఇద్ద‌రు త‌మ ఫ్యామిలీని మీడియా ముందుకు తీసుకొచ్చేందుకు పెద్ద‌గా ఇష్ట‌ప‌డ్డారు. ముఖ్యంగా త‌మ ఇంపాక్ట్ పిల్ల‌ల‌పై ప‌డ‌కూడ‌ద‌ని వారి ఫొటోస్ కూడా ఎన్టీఆర్ పెద్ద‌గా షేర్ చేయ‌రు. ఇక క‌ళ్యాణ్ రామ్ ఫ్యామిలీ గురించి అయితే అభిమానులకు పెద్ద‌గా ఏం తెలియ‌దు. తాజాగా ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ కుటుంబాల నడుమ చక్కని అనుబంధానికి సింబాలిక్ గా తాజాగా వారి సతీమణుల ఫోటో అంతర్జాలంలో హాట్ టాపిక్ అవుతోంది. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి.. కళ్యాణ్ రామ్ సతీమణి స్వాతి ఇరువురు ఓ ఫోటోలో కనిపిస్తున్నారు. `

ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి అభిమానుల‌కు సుప‌రిచితం కాని, క‌ళ్యాణ్ రామ్ సతీమ‌ణి పెద్దగా క‌నిపించ‌దు. తాజాగా `తోటి కోడళ్లు ప్రణతి తారక్- స్వాతి కళ్యాణ్ రామ్ ఒకే ఫ్రేములో క‌లిసి క‌నిపించ‌డంతో ఈ ఫొటోని తెగ వైర‌ల్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఎన్టీఆర్ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక జూనియ‌ర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని (యువసుధ బ్యానర్) తో కలిసి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ లో నిర్మిస్తున్నారు. తారక్ – త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాని హరిక సంస్థ భాగస్వామ్యంలో కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తారు.