సీనియర్ హీరోలు కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. కుర్ర హీరోలు చూపించని జోరు సీనియర్ హీరోలు చూపిస్తూ షాక్ ఇస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఈ నలుగురు హీరోలు ప్రస్తుతం మూడు నాలుగు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రం చేస్తుండగా ఆ తర్వాత లూసిఫర్, వేదాళం రీమేక్‌లు చేయనున్నాడు. బాబీ దర్శకత్వంలోను ఓ చిత్రం చేయనున్నాడు. ఇక నాగార్జున నటించి వైల్డ్ డాగ్ విడుదలకు సిద్ధంగా ఉండగా, త్వరలో ప్రశాంత్ వర్మ సినిమా చేయనున్నాడు.ఆ తర్వాత బంగార్రాజు మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. ఇంక వెంకీ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం నారప్ప, ఎఫ్ 3 చిత్రాలు చేస్తున్నాడు. త్వరలో దృశ్యం2ను తెలుగులో రీమేక్ చేయనున్నాడు.
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో ఓ సినిమా చేయనుండగా, ఈ చిత్రాన్ని మే 28న విడుదల చేయనున్నారు. అయితే టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థగా సత్తా చూపెడుతున్న మైత్రీ మూవీ మేకర్స్ బాలకృష్ణ హీరోగా, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేయబోతుంది. ఈ సినిమాను మహానటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. తాజాగా క్రాక్ వంటి హిట్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన గోపిచంద్ మలినేని ఇప్పుడు బాలకృష్ణతో మాసివ్ సినిమా స్టార్ట్ చేయనున్నాడు అంటే అభిమానుల ఆనందం రెట్టింపు అయింది.
రీసెంట్గా బాలకృష్ణను దర్శకుడు గోపిచంద్ మలినేని కలవగా, వీరిద్దరు కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. స్క్రిప్ట్‌కు సంబంధించి వీరిద్దరి మధ్య కొద్దిసేపు చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. మాసివ్ మాస్ చిత్రంగా గోపిచంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ.. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ‘బలరామయ్య బరిలోదిగితే’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ తర్వాత పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడి, శ్రీవాస్, బి.గోపాల్ వంటి దర్శకులతోను సినిమాలు చేయనున్నట్టు తెలుస్తుంది.