Namratha: ఘ‌నంగా జ‌రుపుకున్న గ‌ణేష్ ఉత్సవం.. వీడియో విడుద‌ల చేసిన న‌మ్ర‌త‌

Namratha: వినాయ‌క చవితి ఉత్సవాలు ప‌ల్లె ప‌ట్ట‌ణం, ఊరు-వాడ అనే తేడా లేకుండా ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటార‌నే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే.సామాన్యులు, సెల‌బ్రిటీలు సైతం వినాక‌య చ‌వితి వేడుక‌ని ఎంతో సంతోషంగా జ‌రుపుకుంటూ ఉంటారు.టాలీవుడ్, బాలీవుడ్,కోలీవుడ్‌,మాలీవుడ్ ఇలా ఇండ‌స్ట్రీల‌కు చెందిన ప్ర‌ముఖులు గ‌ణేష్ ఉత్సవాల‌లో పాల్గొని తెగ సంద‌డి చేస్తుంటారు.

Namratha Celebrates Ganesh Pooja
Namratha Celebrates Ganesh Pooja

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇంట్లో కూడా గ‌ణేష్ సంబ‌రాలు ప్ర‌తి ఏడాది ఘ‌నంగా జ‌రుగుతుంటాయి. ఈ ఏడాదికూడా ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో వినాయ‌క చ‌వితి వేడుక జ‌రుపుకున్నారు. ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకుడికి నమ్రతతో పాటు మహేష్ బాబు కొడుకు, కూతురు గౌతమ్ కృష్ణ, సితార ఎంతో భక్తి శ్రద్దలతో పూజ‌లు చేశారు. ఈ వేడుకలు సంబంధించిన వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఇంట్లో పూజలు చేసిన తర్వాత ఆ వినాయకుడిని నిమజ్జనం కూడా చేసారు. ఈ వేడుకలోమ‌హేష్‌, నమ్రతతో పాటు పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మట్టి గణేశుడిని ఇంట్లోనే ఓ బకెట్‌లో నిమర్జనం చేసి.. పర్యావరణ పరిక్షణకు మేము సైతం అని చెప్పకనే చెప్పారు. ఇక మహేష్ బాబు పిల్లల గురించి చెబితే.. ఇప్పటికే సితార తనకంటూ స్పెషల్ ఐడెండిటీ ఏర్పరుచుకుంది.

‘గణేశుడికి వీడ్కోలు ఎప్పుడూ ఉండదు. ఆ దేవ దేవుడి కృప మా కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది. వచ్చే ఏడాది మళ్లీ త్వరగా వస్తావని ఆశిస్తున్నాను’ అంటూ న‌మ్ర‌త షేర్ చేసిన వీడియో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. మ‌హేష్ సినిమా షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఫ్యామిలీ కార్య‌క్ర‌మాల‌లో త‌ప్ప‌నిసరిగా పాల్గొంటాడ‌నే సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే.

చివ‌రిగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ అందుకున్న మ‌హేష్ ప్ర‌స్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. మన దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు.. త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.