Namitha : నడుము అందాలతో రచ్చ చేస్తున్న బొద్దుగుమ్మ.. లేటెస్ట్ వర్కవుట్ వీడియో వైరల్
Samsthi 2210 - January 26, 2021 / 01:48 PM IST

Namitha : సినీ ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్స్ కి ఎప్పుడు క్రేజ్ ఉంటుంది. హీరోయిన్ నమితకు ఉన్న రేంజ్ కూడా అంతే. తన అందచందాలతో యంగ్ స్టర్స్ ని తన మాయలో పడేస్తుంది. తన నిషా కళ్ళతో మత్తెక్కిస్తుంది. తెలుగు ఇండస్ట్రీకి వెంకటేష్ హీరోగా నటించిన జెమినీ సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో ఎంతో చక్కగా.. నాజుకూగా.. అందంగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా.. వెనక్కి తిరిగి చూసుకోకుండా మారింది ఈ హాట్ బ్యూటీ. అక్కడ అభిమానులు నమిత కోసం ఏకంగా తమ గుండెల్లో గుడి కట్టేశారు. అంత అభిమానం సంపాదించుకుని రేంజ్ పెంచుకుంది. అయితే కొన్ని కారణాలతో సినిమాలకు దూరమయ్యింది.
తెలుగులో కూడా సొంతం సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలయ్య బాబుతో కలిసి స్టెప్పులేసింది. గత కొంత కాలం క్రితం పెళ్ళి చేసుకున్న నమిత సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ ఇఫ్పటికీ మళ్ళీ ఫామ్ లోకి రావాలని ఆలోచనలు చేస్తుంది ఈ బ్యూటీ. అందుకే ఫిజికల్ ఫిట్ నెస్ మెయిన్ టెన్ చేయడానికి తెగ చెమటలు చిందించేస్తుంది. బరువు తగ్గడంలో జిమ్ లో గంటల తరబడి వర్కవుట్స్ చేసి కుర్రకారుకి చెమటలు పట్టిస్తుంది. నడుముతో రకరకాల వర్కవుట్స్ చేస్తూ తన ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. లేటెస్ట్ గా యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ఓ వీడియో ఇఫ్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
బరువు తగ్గిన తర్వాత మరికొన్ని సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. అందుకే సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో.. ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తుంది అంటున్నారు నెటిజన్లు. త్వరలోనే బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నమిత కూడా ఉంటున్నట్లు తెలుస్తుంది. మరో సినిమా అఘోరా నేపథ్యంలో ఉండనున్నట్లు తెలుస్తుంది. వీటితో పాటు కోలీవుడ్ లో కూడా పలు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా నమిత వర్కవుట్ వీడియో మాత్రం నెట్టింట్లో సందడి చేస్తుంది.