Namitha : రాజకీయాలంటే నాకు చాలా ఇష్టం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలయ్య హీరోయిన్
NQ Staff - October 31, 2022 / 10:00 AM IST

Namitha : బాలకృష్ణ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న సీనియర్ నటి నమిత తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భర్త మరియు ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో కలిసి నమిత శ్రీవారిని దర్శించుకున్నట్లుగా తెలుస్తోంది.
రంగ నాయకుల మండపంలో వేద పండితుల ఆమెకు ఆశీర్వచనం ఇచ్చి లడ్డు ప్రసాదమును అందించారు. అనంతరం ఆమె ఆలయం నుండి బయటకు వచ్చారు. ఆ సందర్భంగా మీడియా వారు ఆమెను మాట్లాడించేందుకు ప్రయత్నించారు.
తన పిల్లలు బాగున్నారని.. స్వామి వారి మొక్కు తీర్చుకునేందుకు వచ్చానని పేర్కొంది. అంతే కాకుండా తనకు రాజకీయాలంటే ఆసక్తి అని రాజకీయాల్లో అడుగు పెట్టాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొంది.
రాజకీయాలపై ఉన్న ఆసక్తితో త్వరలోనే తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు నమిత ఆసక్తి చూపిస్తున్నట్లుగా ఆమె మాటలను బట్టి అర్థమవుతుంది. 2019 సంవత్సరంలో బిజెపిలో ఆమె చేరింది.
ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ కార్యకర్త సభ్యురాలిగా ఆమె కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమిళనాడు లో బిజెపి తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ తమిళ మీడియా ద్వారా సమాచారం అందుతుంది.