CARONA: టీకా తీసుకున్నా, క‌రోనా బారిన ప‌డిన స్టార్ హీరోయిన్..!

క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌స్తుతం ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. గ‌తంలో వ‌చ్చిన వైర‌స్ కన్నా కూడా ఇది త్వ‌ర‌గా వ్యాపిస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అవుతుంది. అయితే ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ముఖానికి మాస్క్, భౌతిక దూరం పాటిస్తూ ఉండ‌డ‌మే శ్రీరామ ర‌క్ష. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీకి చెందిన చాలా మంది స్టార్స్ క‌రోనా బారిన ప‌డి, ఐసోలేష‌న్‌లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ప్రముఖ నటి, కాంగ్రెస్‌ నేత నగ్మా సైతం కరోనా బారిన పడ్డారు.

90ల స‌మ‌యంలో తెలుగు, త‌మిళ భాష‌ల‌లో స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన న‌గ్మా ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌లో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 2న తాను క‌రోనా ఫ‌స్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న‌ట్టు ట్విట్ట‌ర్‌లో చెప్పుకొచ్చిన న‌గ్మా టీకా వేసుకున్న ఆరు రోజుల‌కే క‌రోనా బారిన ప‌డింది. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె తెలిపింది. న‌గ్మా క‌రోనా నుండి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆమె అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు కోరుతున్నారు.

Advertisement