Nagarjuna: ఫ‌లించ‌ని నాగ్ ప్ర‌య‌త్నాలు.. చైతూని వ‌దిలి ముంబైకి షిఫ్ట్ కాబోతున్న స‌మంత‌..?

Nagarjuna: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా గుర్తింపు పొందారు అక్కినేని నాగచైతన్య, సమంత. చూడ ముచ్చ‌ట‌గా ఉండే ఈ జంట సినిమాల‌లో న‌టిస్తూ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని కూడా చ‌క్క‌గా న‌డిపించుకుంటూ వ‌చ్చారు. ఇటీవ‌ల ఇద్ద‌రి మ‌ధ్య చెడింద‌ని, త్వ‌ర‌లో విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ ప్ర‌చారం న‌డిచింది. చై, సామ్ మౌనంగా ఉండడం.. అక్కినేని కాంపౌండ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.

Nagarjuna Upset Over Samantha and Chaithanya issue
Nagarjuna Upset Over Samantha and Chaithanya issue

సమంత, చైతు మధ్య అసలు విభేదాలు ఎందుకు తలెత్తాయి అనే విషయంలో స్పష్టమైన సమాచారం లేదు. కానీ అందుతున్న సమాచారం మేరకు సమంత విషయంలో చైతు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సమంత ఫ్యామిలీ కంటే సినిమాలు, ఇతర అంశాలకే ప్రాధాన్యత ఇస్తోందట. అందుకే ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చాయ‌ని టాక్.

ఇరు కుటుంబ సభ్యులు వీరిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి ఎంతో ప్రయత్నించారట. కానీ ఆ పయత్నాలు వర్కౌట్ కాలేదు. సమంత-చైతూ విడిపోవాలనే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు వారిద్దరూ విడాకులకు నిర్ణయం అయిపోయిందని చెబుతున్నారు. ఇద్దరికీ తొలి విడత కౌన్సిలింగ్ సైతం పూర్తయినట్లు సమాచారం.

ప్ర‌స్తుతం చైతూ- స‌మంత విడివిడిగా ఉంటున్న‌ట్టు తెలుస్తుండ‌గా, త్వ‌ర‌లో స‌మంత ముంబైకి షిఫ్ట్ కానుంద‌ట‌. అక్క‌డికి వెళ్లి బాలీవుడ్‌పై ఫోక‌స్ పెట్టాల‌ని అనుకుంటుంద‌ట . ఇందులో ఎంత నిజం ఉంద‌నే దానిపై మాత్రం క్లారిటీ లేదు.కాగా, స‌మంత రీసెంట్‌గా చైతూ న‌టించిన ల‌వ్ స్టోరీ ట్రైల‌ర్‌పై స్పందించిన అక్క‌డ ఆయ‌న పేరు మెన్ష‌న్ చేయ‌లేదు.అత‌ని పేరు ప్రస్తావించటానికి సైతం సమంత ఇష్టపడటం లేదనే ప్రచారం ఉంది.

2017లో చై సామ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. మూడేళ్లపాటు ఈ జంట అన్యోన్యంగా జీవించారు. కానీ ఊహించని విధంగా ఇలా విభేదాలు తలెత్తడంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. నాగార్జున కూడా వీరి వ్య‌వ‌హారంపై కాస్త ఆవేద‌న చెందుతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ దిగులు మ‌న‌సులో పెట్టుకున్న నాగ్ బిగ్ బాస్ షోలోను అంత హోష్‌తో లేన్న‌ట్టు క‌నిపిస్తుంది.

విడాకుల ప్రాసెస్‌కు కోర్టులో కొంత సమయం పడుతుంది, అది తేలాక ఈ ఇద్ద‌రు త‌మ విడాకుల విష‌యాన్ని అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే నాగ్ చిన్న కొడుకు అఖిల్ ఎంగేజ్‌మెంట్ అయిన త‌ర్వాత ఆ అమ్మాయికి బ్రేక‌ప్ చెప్పిన విష‌యం తెలిసిందే. పెద్ద కొడుకు విష‌యంలోను ఇలా జ‌ర‌గ‌డంతో నాగ్ తెగ బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది.