Nagarjuna: కొత్త లుక్‌లో నాగార్జున‌.. ఘోస్ట్ లుక్ ఇదేనా అంటూ చ‌ర్చ‌లు

Nagarjuna:అక్కినేని నాగార్జున త‌న ఇద్దరు కుమారులు నాగ చైత‌న్య‌, అఖిల్‌కి పోటీగా సినిమాలు చేస్తున్నారు. రీసెంట్‌గా చైతూతో కలిసి బంగార్రాజు అనే సినిమా చేశాడు. ఈ చిత్రం జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. నాగార్జున న‌టిస్తున్న మ‌రో మూవీ ‘ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. కొంత మేర‌కు చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

nagarjuna-stunning look viral
nagarjuna-stunning look viral

నిజానికి ఈ చిత్రంలో ముందుగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ, ఆమె గౌత‌మ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది. ప్రెగ్నెన్సీ రావ‌డంతో ఆమె ఘోస్ట్ నుంచి త‌ప్పుకుంది. దీంతో కాజ‌ల్ స్థానంలో అమ‌లాపాల్ పేరు ప‌రిశీలన‌లోకి వ‌చ్చింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ నారంగ్ పుస్కూర్ రామ్మోహన్ రావు శరత్ మరార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున కత్తిపట్టుకుని క్లీన్ షేవ్ తో హత్యలు చేస్తూ కనిపిస్తాడు. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ఈ మూవీలో నాగార్జున సరికొత్త గెటప్ లో మునుపెన్నడూ చూడని సరికొత్త మేకోవర్ తో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

nagarjuna-stunning look viral2
nagarjuna-stunning look viral2

రిటైర్డ్ రా ఏజెంట్ గా నాగ్ నటిస్తున్న ఈ మూవీలో ఆయన పాత్ర ఇదేనంటూ గుబురు మీసాలు గడ్డంతో కనిపిస్తున్న నాగార్జున స్టిల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే మేకర్స్ వెల్లడించే వరకు వేచి చూడాల్సిందే. అనైక సురేంద్రన్, గుల్ పనాగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నారాయణ దాస్ కె.నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు.

నాగార్జున న‌టించిన బంగార్రాజు చిత్రం ప్ర‌స్తుతం జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇందులో త‌న త‌న‌యుడితో నాగ్ చేసే సంద‌డి ఓ రేంజ్‌లో ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఈ సినిమాపై చిత్ర బృందం చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. నాగ్ ఈ సినిమాతో హిట్ కొడితే అదే జోరుతో వ‌రుస సినిమాలు చేయ‌నున్నాడు.