Nagarjuna: చై-సామ్ డైవ‌ర్స్.. స్పందించిన నాగార్జున‌

Nagarjuna: టాలీవుడ్ మోస్ట్ ల‌వబుల్ క‌పుల్ స‌మంత‌- నాగ చైత‌న్య గ‌త ఏడాది అక్టోబ‌ర్ 2న త‌మ మూడేళ్ల బంధానికి స్వ‌స్తి ప‌లికిన విష‌యం తెలిసిందే.ఈ నిర్ణ‌యం చాలా మందిని బాధించింది. ఇది జ‌రిగి మూడు నెల‌లు అవుతున్నా కూడా దీనిపై చ‌ర్చ న‌డుస్తూనే ఉంది. త‌న లైఫ్ గురించి స‌మంత ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తూనే ఉంటుంది. అయితే నాగ చైత‌న్య మాత్రం తొలిసారి మీడియా ముఖంగా స్పందించాడు.

nagarjuna respones on sam and chaitanya diveroce
nagarjuna respones on sam and chaitanya diveroce

విడాకుల ప్రకటన వచ్చిన క్షణం నుంచి చాలా సైలెంట్‌గా ఉంటూ ఈ ఇష్యూపై ఎక్కడా పెద్దగా రియాక్ట్ కాని నాగ చైత‌న్య.. తొలిసారి ‘బంగార్రాజు’ ప్ర‌మోష‌న్‌లో స్పందించారు. నాగార్జునతో కలిసి బంగార్రాజు సినిమాలో నటించిన చైతూ ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. అయితే తాజాగా సమంతతో విడాకుల ఇష్యూ గురించి ఓ మీడియా ప్రశ్నించగా ఎట్టకేలకు ఓపెన్ అవుతూ సింగిల్ లైన్‌లో సమాధానం చెప్పేశారు.

అది ఇద్దరి మంచి కోసం తీసుకున్న డెసిషన్ అని చెప్పిన నాగ చైతన్య.. అక్కడ ఆమె సంతోషంగా ఉంది, ఇక్కడ నేను కూడా సంతోషంగా ఉన్నాను. పరిస్థితులను బట్టి ఇద్దరికీ బెస్ట్ డెసిషన్ ఇదేనని అనిపించిందని అన్నారు.ఇక నాగార్జున కూడా బంగార్రాజు ప్ర‌మోష‌న్స్‌లో చైతూ గురించి స్పందించారు.

వారిద్దరు విడాకులు తీసుకోడం బాధాకరమని, ఏ వ్యక్తి అయినా ఇలాంటి పరిస్థితిని తట్టుకుని నిలబడటం కష్టమని కానీ నాగచైతన్య చాలా కూల్ గా హుందాగా ప్రవర్తించాడని అన్నారు. చైతూ, సామ్ విడిపోవడంపై తాను చాలా వర్రీ అయినట్లు, ఈ పరిస్థితినుంచి చైతన్య ఎలా గట్టెక్కుతాడో అని ఆందోళన చెందానన్నారు. కానీ చైతన్యకు పరిస్థితులను తట్టుకుని నిలబడే ధైర్యముందని, తానే నాకు ధైర్యం చెప్పాడని నాగార్జున అన్నారు.

nagarjuna respones on sam and chaitanya diveroce
nagarjuna respones on sam and chaitanya diveroce

చైతన్య ఇంత మానసిక పరిపక్వతతో వ్యవహరించడం తనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలగించిందన్నారు. ఈ అంశంపై ఓ జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు నాగార్జున స్పందించారు. ఇక త‌న కుమారుడు చైతూతో క‌లిసి నాగ్ న‌టించిన బంగార్రాజు చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.