Nagarjuna : నాగార్జున పేరు మీద అన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయా?
NQ Staff - August 2, 2022 / 03:53 PM IST

Nagarjuna : అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన నాగార్జున ఆనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున అనేక జానర్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి సినిమాలోనైనా ఎలాంటి పాత్రలోనైనా అద్భుతంగా నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు నాగార్జున.
అంత ఆస్తులు సంపాదించాడా!

Nagarjuna Property value Estimated Rs 1050 crores
కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటున్న నాగార్జున బాగానే వెనకేసినట్టు తెలుస్తుంది. అక్కినేని స్టూడియోస్ నిర్వహణ నిర్వహిస్తూ అదే విధంగా వాటి మీద పలు సినిమాలను కూడా తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు వీటితోపాటు పలు వ్యాపార ప్రకటనలు టీవీ షో ల ద్వారా కూడా నాగార్జున బాగా సంపాదిస్తూ ఉన్నారు.అయితే అంతే కాకుండా హైదరాబాద్ లో పలు పరిసరాల ప్రాంతాలలో కూడా కొన్ని ఖరీదైన భూములు ఉన్నట్లుగా సమాచారం.
ఇటీవల వెలువడిన కొన్ని మీడియా కథనాల ప్రకారం నాగార్జున ఆస్తి విలువ దాదాపుగా రూ.1050 కోట్ల రూపాయలు ఉన్నట్లు అంచనా. టీవీ షోలు, సినిమాలు, యాడ్స్ ద్వారా కూడా నాగార్జున బాగానే సంపాదిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం నాగార్జున హీరోగా ఘోస్ట్ అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే మరి ఈ సినిమా అయినా విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి…