Nagarjuna: బ్యాచిల‌ర్ టీంకి పెద్ద పార్టీ ప్లాన్ చేసిన నాగార్జున‌

Nagarjuna: ఇన్ని రోజుల త‌ర్వాత నాగార్జున‌లో ఫుల్ జోష్ క‌నిపిస్తుంది. అక్కినేని నటవారసుడు అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రంతో తొలి సక్సెస్ అందుకున్నాడు. కొన్నేళ్ల పాటు పోరాటం చేసినా అందని ద్రాక్షలా మారిన సక్సెస్ ని బ్యాచిలర్ తో అందిపుచ్చుకున్నాడు. ఈ నేప‌థ్యంలో నాగార్జున‌తో పాటు ఆయ‌న ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంది.

TheNewsQube-

Nagarjuna

నాగార్జున కు ఎదురైనట్టే ఆరంభం అఖిల్ కి పరాజయాలు తప్పలేదు. ఇక ఇంచుమించి నాగ్ తన నాలుగో చిత్రంతోనే నాడు విజయం అందుకున్నారు. అదే ఫీట్ ని అఖిల్ ఇప్పుడు రిపీట్ చేశాడని చెప్పాలి. కెరీర్ నాలుగో సినిమాతో విజయం అందుకున్నాడు అఖిల్. ఇకపై తనయుడి విషయంలో నాగ్ కి మరింత బాధ్యత పెరిగింది. తొలి నుంచి అఖిల్ చేసే సినిమాల విషయంలో నాగ్ అవసరం మేర ఇన్వాల్వ్ అయ్యారు.

స్క్రిప్ట్ నాగ్ విన్న తర్వాతే అఖిల్ వరకూ వెళ్లేది. ఆ కాన్ఫిడెన్స్ తో నే అఖిల్ ని మెగా నిర్మాత అల్లు అరవింద్ చేతుల్లో పెట్టారు. అరవింద్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున బ్యాచిలర్ టీమ్ కి గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. గీతా ఆర్స్ట్ టీమ్ మొత్తాన్ని ఆహ్వానించి స్పెషల్ గా ట్రీట్ ప్లాన్ ఏర్పాటు చేస్తున్నారుట.

ఇక ఇటీవలే `ఎమ్.ఈ.బీ` మొత్తం యూనిట్ కి అఖిల్ కూడా పార్టీ ఇచ్చాడు. బ్యాచిలర్ సక్సెస్ మీట్ తర్వాతి రోజున అఖిల్ తన టీమ్ అందరినీ పిలిచి గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసాడు. ఈ పార్టీకి అఖిల్ స్నేహితులు.. కొందరు పరిశ్రమ వ్యక్తులు కూడా హాజరయ్యారు. ఇప్పుడు నాగార్జున వంతు కాబట్టి అతని స్నేహితులు.. సహచరులు హాజరయ్యే అవకాశం ఉంది. చిరంజీవి.. చరణ్ సహా మెగా హీరోలంతా జాయిన్ అవ్వడానికి ఆస్కారం ఉందని భావిస్తున్నారు.

`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 20.5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. విడుదలైన 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును దాటింది. ఈ చిత్రం అమెరికా లో 5 వ రోజు 28694 డాలర్లను వసూలు చేసింది. దీంతో 5 రోజుల మొత్తం 500006 (రూ. 3.74 కోట్లు) డాలర్లకు చేరుకుంది. MEB రాయల్ గా అర మిలియన్ క్లబ్ లోకి ప్రవేశించడంతో అఖిల్ యుఎస్ లో తన కెరీర్ బెస్ట్ ని అందుకున్నాడు.