Nagarjuna : అనుష్క‌తో చైతూ ఎంగేజ్‌మెంట్‌.. నాగార్జున స్పంద‌న ఏంటి?

Nagarjuna : సినిమా వాళ్ల‌పై వ‌చ్చే రూమర్స్‌కి అంతే ఉండ‌దు. సోష‌ల్ మీడియా వ‌చ్చాక అవి మ‌రింత ఎక్కువ‌య్యాయి. అయితే ఈ రూమ‌ర్స్‌లో కొన్ని నిజం అని తేలితే.. మరికొన్ని రూమర్స్ గా మిగిలిపోతుంటాయి. గతంలో టాలీవుడ్ హీరో నాగచైతన్యకు సంబంధించిన ఓ రూమర్ ఇండస్ట్రీలో హల్ చల్ చేసింది. ఇప్పుడు దీనిపై జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది.

nagarjuna on chaitus engagement with anushka
nagarjuna on chaitus engagement with anushka

2017 లో ఓ ఇంటర్వ్యూలో నాగ్ తన కుమారుడు చైతూ, అనుష్కశెట్టి ఎగేంజ్ మెంట్ రూమర్స్ పై రియాక్ట్ అయ్యాడు. త్రోబాక్ ఇంటర్వ్యూలో నాగార్జున అక్కినేని రూమర్స్ ఎలా స్పందించారో షేర్ చేసుకున్నారు. ‘‘నాగచైతన్య, అనుష్కశెట్టికి ఎగేంజ్ మెంట్ జరిగిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ విషయం నా వరకు వచ్చింది.

nagarjuna on chaitus engagement with anushka
nagarjuna on chaitus engagement with anushka

ఆ సమయంలో చైతూ స్విట్జర్లాండ్‌లో షూటింగ్ చేస్తున్నాడు. నేను ఉదయాన్నే చైతూ ఫోన్ చేసి చెప్పాను. ‘‘హేయ్, నీకు నిన్న రాత్రి అనుష్కతో నిశ్చితార్థం జరిగింది, మీరు నాకు కూడా చెప్పలేదు. దానికి చైతూ రెస్పాండ్ అవుతూ.. ‘వాహ్, నిజమే’ అని బిగ్గరగా నవ్వాడు. ఆ తర్వాత నేను అనుష్కని కూడా పిలిచా. అందరం బాగా నవ్వుకున్నాము.” అని అన్నారు నాగార్జున.

నాగార్జున మాత్రమే కాదు, చై, అనుష్క కూడా ఎగేంజ్ మెంట్ పుకార్లు విని షాక్ అయ్యారు. ఇదంతా ఎలా స్పెడ్ అయ్యిందో తెలియదట. అనుష్క స్పందిస్తూ.. ఎవరో ఒక నిర్మాత కావాలనే రూమర్ పుట్టించాడని చెప్పుకొచ్చింది. కాగా గతంలో నాగార్జునకు అనుష్క శెట్టి, ఛార్మీ కౌర్‌తో సహా చాలా మంది నటీమణులతో కూడా లింక్ ఉన్నట్లు కూడా గాసిప్స్ వినిపించాయి.

నాలుగేళ్ల క్రితం స‌మంత‌ని వివాహం చేసుకున్న నాగ చైత‌న్య కొన్ని కార‌ణాల వ‌ల‌న అక్టోబ‌ర్ 2న ఆమెకు విడాకులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఎవ‌రి వ‌ర్క్స్‌తో వారు బిజీగా ఉన్నారు.