Nagarjuna : నాగార్జున సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రష్మీ గౌతమ్..!

Nagarjuna : టాలీవుడ్ మన్మధుడు ..కింగ్ నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి హిట్ సాధించింది. దాంతో నాగార్జున వరుసగా సినిమాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇప్పటికే టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు కమిటయిన నాగ్ ఈ సినిమా షూటింగ్ కూడా మొదలై కొంత టాకీ పార్ట్ పూర్తయింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది.

nagarjuna-movie got chance for rashmi gowtham
nagarjuna-movie got chance for rashmi gowtham

భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాజల్ అటు మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం అందుకుంది. ఆచార్య దాదాపు పూర్తి చేసేసింది. ఇటు నాగ్ సినిమాలో ఛాన్స్ అంటే ఇక ఇప్పట్లో ఈమె క్రేజ్ కి బ్రేక్ పడటం కష్టం. ఇలా హీరోయిన్స్‌కి సీనియర్ స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇందులో భాగంగా ఇప్పుడు హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కి కూడా నాగార్జున సినిమాలో ఛాన్స్ వచ్చిందని తాజా సమాచారం.

Nagarjuna : నాగార్జున సినిమాలలో అనసూయ లాంటి క్రేజీ యాంకర్స్ నటిస్తూనే ఉన్నారు.

ఇంతక ముందు రష్మీ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన గుంటూరు టాకీస్‌లో హీరోయిన్‌గా నటించింది. ఆ పరిచయం వల్లే ఇప్పుడు నాగార్జున సినిమాలో అవకాశం ఇచ్చాడని తెలుస్తోంది. నాగార్జున సినిమాలలో అనసూయ లాంటి క్రేజీ యాంకర్స్ నటిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మంచి ఛాన్స్ రష్మీకి దక్కినట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే రష్మీ క్రేజ్ టాలీవుడ్‌లో అమాంతం పెరిపోగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక రష్మీకీ ఇటు హీరోయిన్‌గా అటు యాంకర్‌గా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.