NAGARJUNA : మాల్దీవులకు క్యూ కట్టిన సెలబ్రిటీ ఫ్యామిలీస్.. నాగ్ కుటుంబం కూడా..
Priyanka - February 10, 2021 / 03:08 PM IST

NAGARJUNA : టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీ ఫ్యామిలీలు మాల్దీవులలో విహరించేందుకు వెళుతున్నారు. ఇప్పటికే కాజల్ అగర్వాల్ తన పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లగా, ఆ తర్వాత నిహారిక– చైతన్య కూడా మాల్దీవులకు వెళ్లి అక్కడ కొద్ది రోజులు సరదాగా గడిపొచ్చారు. సమంత-నాగ చైతన్య కూడా మధ్యలో మాల్దీవుస్ ట్రిప్‌కు వెళ్లారు. రీసెంట్‌గా మోహన్ బాబు ఫ్యామిలీ, కృష్ణం రాజు ఫ్యామిలీ కూడా మాల్దీవులలో చక్కర్లు కొట్టారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.
ఇక ఇప్పుడు అక్కినేని హీరో నాగార్జున తన సతీమణితో కలిసి మాల్దీవులకి షార్ట్ ట్రిప్‌గా వెళ్లొచ్చినట్టు తెలుస్తుంది. అమల తన సోషల్ మీడియాలో మాల్దీవులకు సంబంధించిన ఫొటోలు షేర్ చేయగా, ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. లాక్ డౌన్ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4తో పాటు వైల్డ్ డాగ్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న నాగార్జున కాస్త రిలాక్సేషన్ కోసం తన శ్రీమతితో భూతల స్వర్గానికి వెళ్లినట్టు తెలుస్తుంది. త్వరలో బంగార్రాజు మూవీ చేయనున్నాడని టాక్.
A week of bliss in the Maldives! @iamnagarjuna #maldives #bliss #vacation pic.twitter.com/vhoDHyVtez
— Amala Akkineni (@amalaakkineni1) February 4, 2021