Nagarjuna: ఓటీటీ కోసం స్పెష‌ల్ షో చేయ‌బోతున్న నాగార్జున‌..!

Nagarjuna: అక్కినేని నాగార్జున ఈ వ‌య‌స్సులోను దూకుడు కొన‌సాగిస్తున్నారు. కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూనే మ‌రోవైపు బుల్లితెరపై కూడా స‌త్తా చాటుతున్నారు. ఇటీవ‌ల వైల్డ్ డాగ్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన నాగ్ గ‌త ఏడాది బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు. మ‌రి కొద్ది రోజుల‌లో సీజ‌న్ 5ని కూడా మొద‌లు పెట్ట‌నున్నారు. ఇప్ప‌టికే ఈ షోకి హోస్ట్‌గా నాగ్ అని దాదాపు క‌న్‌ఫాం అయింది.

Nagarjuna

ప్ర‌స్తుతం ఓటీటీ హ‌వా న‌డుస్తున్న నేప‌థ్యంలో టాలీవుడ్ ప్ర‌ముఖులు ఓటీటీపై దృష్టి పెడుతున్నారు. అల్లు అర‌వింద్ ఇప్ప‌టికే ఆహా అనే ఓటీటీ సంస్థ‌ను లాంచ్ చేయ‌గా, త్వ‌ర‌లో నాగార్జున కూడా అదే రూట్లో ప‌య‌నించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో ఓటీటీ కి సంబంధించిన ఒక షో ను నాగార్జున అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఆ షో ఏంటీ అనే విషయమై ఒకటి రెండు వారాల్లో క్లారిటీ ఇవ్వబోతున్నారు.

ఇప్ప‌టికే నాగార్జున కోడ‌లు స‌మంత ఓటీటీ స్పెష‌ల్ షోకి హోస్టింగ్ చేయ‌డంతో పాటు వెబ్ సిరీస్‌లోను న‌టించింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో స‌మంత పోషించిన రోల్‌కు అశేష ఆద‌ర‌ణ ద‌క్కింది. అయితే ఇప్పుడు నాగార్జున కూడా ఓటీటీ షోతో పాటు వెబ్ సిరీస్ లోను న‌టించ‌డానికి సిద్ధమయ్యాడ‌ట‌. నాగార్జున హోస్టింగ్ చేయబోతున్న కొత్త ఓటీటీ షో బిగ్ బాస్ షో కు సమాంతరంగానే ఉంటుందని స‌మాచారం.

Nagarjuna

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున‌ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. అది మాత్రమే కాకుండా నాగార్జున నుండి చాలా రోజులుగా అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్న బంగార్రాజు సినిమా కూడా రూపొందుతుంది. ఈ సినిమాల‌ను దాదాపు ఈ ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు నాగ్.

ఇక సెప్టెంబ‌ర్ లో బిగ్ బాస్ సీజ‌న్ 5 మొద‌లు కానున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ షో కోసం ఇప్ప‌టికే నాగ్ స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ట. త్వ‌ర‌లో ఆయ‌న‌పై కొన్ని ప్రోమోస్ చిత్రీక‌రించ‌నున్నార‌ని తెలుస్తుంది. క‌రోనా వ‌ల‌న షో ఇప్ప‌టికే చాలా రోజులు డిలే అయింది. వీలైనంత త్వ‌ర‌గా దీనిని స్టార్ట్ చేయాల‌ని అనుకుంటున్నారు.