Nagarjuna: బ్యాచిల‌ర్ టీంకి పార్టీ ఇచ్చిన నాగార్జున‌.. ఫుల్ ఖుష్‌లో చిత్ర బృందం

Nagarjuna ఎంత‌టి పెద్ద స్టార్ అయిన కొడుకు విజ‌యం సాధిస్తే ఆ ఆనందం వేరే లెవ‌ల్‌లో ఉంటుంది. అఖిల్ న‌టించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిరాశ‌ప‌ర‌చ‌గా,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రం మాత్రం మంచి హిట్ ఇచ్చింది. ఈ విజ‌యంతో నాగార్జున ఫుల్ జోష్ తో ఉన్నారు. ఇకపై తనయుడి విషయంలో నాగ్ కి మరింత బాధ్యత పెరిగింది.

ముందు నుంచి అఖిల్ చేసే సినిమాల విషయంలో నాగ్ అవసరం మేర ఇన్వాల్వ్ అయ్యారు. స్క్రిప్ట్ నాగ్ విన్న తర్వాతే అఖిల్ వరకూ వెళ్లేది. ఆ కాన్ఫిడెన్స్ తో నే అఖిల్ ని మెగా నిర్మాత అల్లు అరవింద్ చేతుల్లో పెట్టారు. నాగ్ పెట్టిన న‌మ్మకాన్ని వ‌మ్ము చేయ‌లేదు అర‌వింద్.

దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలైన హిట్ టాక్ తెచ్చుకుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ వసూళ్లు ఊహకు అందని రీతిలో ఉన్నాయి. దసరా విన్నర్ గా నిలిచిన ఈ చిత్రం ఐదురోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకోవడం విశేషం. యూఎస్ లో సైతం భారీ వసూళ్లు రాబడుతుంది. నాలుగవ ప్రయత్నంలో క్లీన్ హిట్ అందుకున్న అఖిల్ కెరీర్ పై నాగార్జునకు నమ్మకం ఏర్పడింది

అఖిల్ కి మంచి హిట్ ఇచ్చిన నేప‌థ్యంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ టీమ్ కి వరుస పార్టీలు ఇచ్చారు కింగ్ నాగార్జున. చిత్ర బృందం ఈ పార్టీకి హాజ‌రు కాగా, అందులో నాగ్ చాలా సంతోషంగా క‌నిపిస్తున్నారు. అఖిల్ ఇప్పటికే తన క్లోజ్ ఫ్రెండ్స్ తో పాటు చిత్ర యూనిట్ కి ఓ పార్టీ ఏర్పాటు చేయగా, కింగ్ నాగార్జున ఈ చిత్ర నిర్మాతలుగా ఉన్న అల్లు అరవింద్, బన్నీ వాసులతో పాటు చిత్ర యూనిట్ కి ప్రత్యేక విందు ఇవ్వనున్నారట.

 

నాగార్జున సైతం మొదట్లో వరుస ప్లాప్స్ అందుకున్నారు. ఆయన డెబ్యూ మూవీ విక్రమ్ తో పాటు కెప్టెన్ నాగార్జున, అరణ్య కాండ వరుసగా ప్లాప్ అయ్యాయి. దాసరి దర్శకత్వంలో నాగార్జున చేసిన నాలుగవ చిత్రం మజ్ను సూపర్ హిట్ కాగా, మొదటి విజయాన్ని అందించింది.