Nagarjuna: మెగా హీరోకి నాగ్ అంత రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నాడా..!

Nagarjuna: మెగా ఫ్యామిలీ నుండి ఏ హీరో వ‌చ్చిన కూడా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఒక్క సినిమాతోనే స్టార్ స్టేట‌స్ సంపాదిస్తున్నారు. ఇటీవ‌ల ఉప్పెన సినిమాతో వైష్ణ‌వ్ తేజ్ వెండితెర డెబ్యూ ఇచ్చాడు.ఈ సినిమా వైష్ణ‌వ్ తేజ్‌కు మంచి క్రేజ్ అందించ‌డంతో పాటు ఆయ‌న‌కు ప్ర‌త్యేక అభిమాన‌గ‌ణం ఏర్పాటు అయ్యేలా చేసింది. ఉప్పెన సినిమా త‌ర్వాత వైష్ణ‌వ్ తేజ్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేశాడు.

ఈ సినిమా షూటింగ్ పూర్తై చాలా రోజులే అవుతున్నా, మూవీకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు.ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇందులో క‌థానాయిక‌గా న‌టించింది. ‘కొండపొలం’ నవల ఆధారంగా క్రిష్ తీసిన సినిమాలో వైష్ణవ్ తేజ్ నటించాడు. ఇప్పుడు కూడా వైష్ణవ్ తేజ్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. విశేషం ఏమంటే… ప్రముఖ నటుడు, నిర్మాత నాగార్జున సైతం వైష్ణవ్ తేజ్ తో సినిమా తీయాలని కొంతకాలంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

క్రీడా నేపథ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ హాకీ ప్లేయర్ గా నటిస్తాడట. ఇందుకోసం వైష్ణవ్ కు నాగార్జున ఏకంగా రూ. 5 కోట్ల పారితోషికాన్ని ఇవ్వబోతున్నాడనే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. కొత్త హీరోకి ఇంత పారితోషికం ఇవ్వ‌డం ప‌ట్ల అంద‌రు ఆశ్చర్య‌పోతున్నారు.

పృధ్వీ అనే నూతన దర్శకుడు తెరకెక్కించబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోందని, అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.స‌క్సెస్‌లు లేని త‌న త‌నయులు నాగ్ చైత‌న్య‌,అఖిల్‌తో కాకుండా వైష్ణ‌వ్ తేజ్‌కి అంత కోట్లు ఇచ్చి సినిమా చేయ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

వైష్ణవ్ ఉప్పెన చిత్రంతో డెబ్యూ హీరోగా ఘనమైన ఎంట్రీ ఇచ్చాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. దీనితో వైష్ణవ్ కు అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుండ‌గా, దీనికి సీనియర్ దర్శకుడు దశరధ్ కథ అందిస్తున్నారు.

ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా బోగవిల్లి ప్రసాద్ వ్యవహరిస్తారు. అయితే ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యే లోగా సురేందర్ రెడ్డి హీరో అఖిల్ తో ఏజెంట్ సినిమా పూర్తి చేయాలి. వీలైతే పవన్ కళ్యాణ్ సినిమా పూర్తి చేయాలి. ఆ తరువాత ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌క‌ట‌న రానుంది.