Akhil : అఖిల్ కోసం నాగార్జున పిలిచి మరీ ఆదర్శకుడి ఛాన్స్ ఇచ్చాడట..?

Akhil : అఖిల్ కి భారీ ఇచ్చే దర్శకుడు నాగార్జున కి ఇంతకాలానికి కనిపించాడని అన్నపూర్ణ కాంపౌండ్ లో చెప్పుకుంటున్నట్టు తాజా సమాచారం. అఖిల్ డెబ్యూ సినిమా కి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించాడు. అఖిల్ అన్న టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత మనం ఫేం విక్రం కె కుమార్ తో హలో అన్న సినిమా చేశాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాట లేకపోయింది. ఇక ముచ్చటగా మూడవ సినిమా యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేశాడు అఖిల్. మిస్టర్ మజ్ఞు అన్న టైటిల్ తో వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.

nagarjuna-gave-chance-to-that-director-for-akhil
nagarjuna-gave-chance-to-that-director-for-akhil

అయితే డెబ్యూ సినిమా కంటే తర్వాత రెండు సినిమాలలో అఖిల్ పర్ఫార్మెన్స్ పరంగా బాగానే మెరుగయ్యాడని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపించింది. నిజంగానే అఖిల్ యాక్టింగ్ పరంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కాగా ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అన్న సినిమా చేస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్ పై బన్నీ వాసు – వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కంప్లీట్ అవుతోంది.

Akhil : అఖిల్ హీరోగా నెక్స్ట్ సినిమా అన్నపూర్ణ బ్యానర్ లో ..?

ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ 5 స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్నాడు. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతుంది. అనిల్ సుంకర తో పాటు సురేందర్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నాడు. అయితే ఇంత కాలానికి అఖిల్ కి సాలీడ్ హిట్ ఇచ్చే దర్శకుడు నాగార్జున కంటికి తారసపడినట్టు సమాచారం. ఆ దర్శకుడే ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచిన బుచ్చిబాబు సానా. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా తో భారీ హిట్ ఇచ్చాడు. రెండవ సినిమా కూడా మైత్రీ నిర్మాతలకే చేస్తున్నాడు. కాగా నెక్స్ట్ సినిమా అన్నపూర్ణ బ్యానర్ లో అఖిల్ హీరోగా నిర్మిచేందుకు నాగార్జున ప్లాన్ చేస్తున్నాడట. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో.

Advertisement