Nagarjuna: ఇంత చిన్న వ‌య‌స్సులోనే ర‌కుల్‌ని ప్రేమించావా.. వైష్ణ‌వ్‌కు నాగార్జున ప్ర‌శ్న‌

Nagarjuna: మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ఉప్పెన సినిమాతో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. త‌న రెండో సినిమాగా కొండ పొలం సినిమా చేశాడు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. అయితే కరోనా కారణంగా విడుదలకు నోచుకోలేదు అంతే. మధ్యలో ఓటిటిలో విడుదల చేయాలని సన్నాహాలు చేసారు కానీ ఇప్పుడు పరిస్థితులు బాగానే ఉండటంతో మనసు మార్చుకుంది చిత్ర బృందం.

నల్లమల అడవులను జల్లడ పట్టి అదిరిపోయే విజువల్ ట్రీట్ ఇచ్చాడు దర్శకుడు క్రిష్. అక్టోబర్ 8న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుద‌ల చేశారు. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా రూపోందించారు దర్శకుడు క్రిష్. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ నవలను సినిమాగా తెరకెక్కించేందుకు కథలో కొన్ని మార్పులను చేశాడట క్రిష్.

బి టెక్ చేసిన ఓ కుర్రాడు.. తన తండ్రితో తమ గొర్రెలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు.. బిటెక్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఎందుకు మారాడు వంటి అంశాలు నవలలో ప్రధాన అంశాలు.. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్ పాత్రలో కనిపించి అల‌రించింది. ఈ సినిమాలో ఆమె ఓబులమ్మ అనే పాత్రను చేసింది. ఇక ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేసాడు క్రిష్. వికారాబాద్ అడవుల్లోనే ఎక్కువు శాతం చిత్రీకరించారు.

కొండ పొలం చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా చిత్ర హీరో వైష్ణ‌వ్‌తేజ్, ద‌ర్శ‌కుడు క్రిష్ బిగ్ బాస్ షోకి హాజ‌ర‌య్యారు.వేదిక‌పై నాగార్జున‌తోక‌లిసి సంద‌డి చేశారు. వైష్ణ‌వ్ ఇంత చిన్న వ‌య‌స్సులోనే ర‌కుల్‌ని ప్రేమించావా అంటూ నాగార్జున అడ‌గ‌గా, అందుకు వైష్ణ‌వ్ చేయాల్సి వ‌చ్చింద‌ని బ‌దులు ఇచ్చాడు. మీరు 45 రోజులు అడ‌వుల్లో ఉంటే మా వాళ్లు 105 రోజులు ఇక్క‌డ ఉంటున్నారు అని నాగ్ అన్నాడు.చూస్తుంటే షో సంద‌డిగా సాగిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.