Nagarjuna: యాంక‌ర్ ర‌విని మ‌ళ్లీ ఇరికించిన నాగార్జున‌.. ఆ రోజు తొంద‌ర్లోనే వస్తుంద‌న్న కాజ‌ల్

Nagarjuna: బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం చూస్తుండ‌గానే ఐదో వారం పూర్తి చేసుకోవ‌డానికి సిద్ధ‌మైంది. 19 మంది కంటెస్టెంట్స్ తో షో మొద‌లు కాగా, ఇప్ప‌టికి న‌లుగురు ఎలిమినేట్ అయ్యారు. ప్ర‌స్తుతం హౌజ్‌లో 15 మంది ఉన్నారు. అయితే ఈ రోజు మ‌రొక‌రు ఎలిమినేట్ కానున్నారు. అయితే ఐదోవారంలో ఏకంగా తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. మరి వీళ్లలో ఎవర్ని సేవ్ అవుతారనేది చూడాలి..!

రాజా రాజా ది గ్రేట్ రా’ సాంగ్ ఎంట్రీ ఇచ్చిన నాగ్ .. శుక్ర‌వారం జ‌రిగిన ఎపిసోడ్‌కి సంబంధించి కొన్ని విజువ‌ల్స్ చూపించాడు. జెస్సీ జైల్లో ఉన్న కాజల్‌తో మాట్లాడుతూ … ‘నువ్వు మధ్యలో ఆగిపోయావ్.. హమీదాకు గట్టిగా ఇవ్వాల్సిందిగా.. అసలు తను నీ ముఖం మీద నీళ్లు ఎంట్లా విసిరి కొట్టింది.. తనకు గట్టిగా ఇవ్వాల్సింది నువ్వు’ అని జెస్సీ అన్నాడు. అందుకు స్పందించిన కాజ‌ల్ .. ‘తను నన్ను అక్కా అని పిలవడంతో అంత వ్యతిరేకంగా మాట్లాడలేకపోయాను..’ అంటుంది.

ఇక సిరి, జెస్సీ, షణ్ముక్‌లు శ్రీరామ్ గురించి మాట్లాడుకుంటారు. ‘పార్షియాలిటీ అనగానే నేను చెయ్య ఎత్తాను.. నువ్వు ఎత్తావా’ అని సిరి అనగానే.. జెస్సీ, షణ్ముక్‌లు కూడా మనం ముగ్గురం ఎత్తాం అని చెప్పుకుంటారు.ఇక మానస్ రవితో మాట్లాడుతుంటే.. ‘కాజల్ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు.. తను సింపథీ కార్డ్ కోసం ట్రై చేస్తుంది..’ అంటూ చెప్పడంతో అవే మాటలు తిరిగి మానస్ కాజల్‌తో పంచుకుంటాడు.

రేషన్ మేనేజర్‌గా ఉంటే సరిపోదు చూసుకోవాలి కదా.. అంటూ ప్రియ .. విశ్వ‌పై ఫైర్ కావడంతో విశ్వ కూడా నేను వాళ్లకి ఆల్ రెడీ చెప్పాను అక్కా.. మీరు తెలుసుకోకుండా వర్లకండి అంటాడు. దాంతో ఆ పదాలేంటీ.. అలాంటి పదాలు వాడొద్దు అంటూ ప్రియా సీరియస్ అవుతుంది. ఇక కాజల్‌కి జైలు శిక్షా కాలం పూర్తి కావడంతో ఆమెని జైలు నుంచి బిగ్ బాస్ విడుదల చేశాడు.

ఇక ఇంటి స‌భ్యులని ప‌ల‌క‌రించిన నాగార్జున ఒక్కొక్క‌రికి ప‌లు ప్ర‌శ్న‌లు వేయ‌డం మొద‌లుపెట్టాడు. శ్రీరామ్‌ని బిగ్ బాస్ టైటిల్ ముఖ్యమా.. హమీదా ఇష్టమా అని అడగడంతో అంతా పెద్దగా నవ్వడం.. శ్రీరామ్ ‘కచ్చితంగా బిగ్ బాస్ టైటిల్ ముఖ్యమని చెప్పడంతో హమీదా కాస్త ఫీల్ అయినట్లే కనిపించింది. ఇక సిరిని లేపి.. ‘సిరి నువ్వు అంటూ ఉంటావ్ కదా.. ఒకరు లేనప్పుడు ఒకరి వెనుక మాట్లాడొద్దు అంటావ్ కదా.. మరి నువ్వు నీ అడ్డాలో కూర్చుని చేస్తున్నది ఏమిటీ’ అని నాగార్జున అడిగే సరికి సిరి నీళ్లు న‌మిలింది.

ఇక ‘కొండ పొలం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆ సినిమా డైరెక్టర్ క్రిష్, హీరో వైష్ణవ్ తేజ్‌లు వచ్చి ఇంటి సభ్యులతో ముచ్చటించారు. ఇంత చిన్న వయసులో రకుల్‌ని ఎలా ప్రేమించావయ్యా అని నాగార్జున చమత్కరిస్తే.. చేయాల్సి వచ్చింది సార్ అని అన్నాడు వైష్ణవ్. ఎంటర్ టైన్మెంట్ అనే ముసుగులో ఎన్నిరోజులు ఇలాగే ఉంటారని లోబోని.. ఏవో షేడ్స్ చూపిస్తానని బిగ్ బాస్‌కి వచ్చావ్.. ఏమైపోయాయి నీ షేడ్స్ అన్నీ అని శ్వేతని.. ప్రశ్నలు అడిగి కడిగిపారేశాడు దర్శకుడు క్రిష్.

ఇక నాగార్జున కూడా క్రిష్, వైష్ణవ్‌ల ముందే రవికి క్లాస్ పీకారు. ఏమయ్యా రవి.. ఎవరు ఎలా ఆడాలో నువ్వే చెప్తావ్ నీ గేమ్ ప్లాన్ ఏంటి? అవసరం లేని వాళ్లకి కూడా అడ్వైజ్‌లు ఇస్తావ్.. ఎందుకు నీతులు ఎందుకు చెప్తావ్ అని అడిగారు నాగార్జున. అయితే రవి మాత్రం ఎప్పటిలాగే తన తప్పుని ఒప్పుకోకుండా అతి తెలివి చూపించాడు. అయితే నాగార్జున మరో పంచ్ ఇచ్చాడు.

రాజుగా కెప్టెన్ పోటీదారుల్ని ఎంపిక చేయమని చెప్తే.. అందర్నీ ఆడపిల్లల్లే ఎందుకు సెలెక్ట్ చేశావ్? ఈజీగా గెలిచేద్దామనా? అని రవి మైండ్ బ్లాక్ అయ్యే ప్రశ్న వేశారు నాగార్జున. అదేం లేదు సార్.. అదసలు పాయింట్ కాదు అని నాకు అది నచ్చకే గేమ్ వదిలేశా అని చెప్పాడు రవి. ఇక కాజ‌ల్ కి మిడిల్ ఫింగ‌ర్ చూపించ‌డంపై కూడి డిస్క‌ష‌న్ న‌డిచింది. నాగార్జున వీడియో కూడా చూపించి దానిపై క్లారిటీ తీసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ప్రస్తుతం నామినేషన్స్‌లో ఉన్న 9 మందిలో ఒక్కర్ని కూడా సేవ్ చేయకుండా నేటికి వాయిదా వేశారు. చూస్తుంటే ఈ రోజు డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉంటుందా అనే సందేహం క‌లుగుతుంది.