Nagarjuna: నైట్ పార్టీ లో ఆమిర్ ఖాన్‌తో ఆ విష‌యం చెప్పి ఎమోష‌న‌లైన నాగార్జున‌

Nagarjuna: మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ న‌టించిన లాల్ సింగ్ చ‌ద్దా చిత్రంలో అక్కినేని హీరో నాగ చైత‌న్య ముఖ్య పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా నుండి చైతూ- ఆమిర్ మ‌ధ్య బాండింగ్ బ‌ల‌ప‌డింది. ఈ క్రమంలో చైతూ న‌టించిన ల‌వ్ స్టోరీ చిత్ర ప్రీరిలీజ్ వేడుక‌కి గెస్ట్ గా హాజ‌రయ్యాడు ఆమిర్‌.

Nagarjuna Emotional Before Aamir Khan in that Issue
Nagarjuna Emotional Before Aamir Khan in that Issue

హైదరాబాద్‌కి వ‌చ్చిన ఆమిర్‌కి స్పెషల్‌గా పార్టీ ఇచ్చాడు నాగార్జున. ఇందులో `లవ్‌ స్టోరి` టీమ్‌, సాయిపల్లవి, శేఖర్‌ కమ్ముల, నాగచైతన్య కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున, ఆమిర్‌ ఖాన్‌ ల మధ్య చాలా విషయాలు చర్చకు వచ్చాయట. ముఖ్యంగా నాగచైతన్య గురించి చాలా విషయాలు చర్చించారట. ఇందులో భాగంగా చైతూ గురించి ఓ విషయాన్ని తలచుకుని ఎమోషనల్‌ అయ్యారట నాగ్‌.

Nagarjuna Emotional Before Aamir Khan in that Issue
Nagarjuna Emotional Before Aamir Khan in that Issue

లాల్ సింగ్ చ‌ద్దా చిత్రంలో చైతూ తెలుగుకి చెందిన ఆర్మీ అధికారిగా `బాలరాజు` అనే పాత్రలో కనిపించబోతున్నట్టు ఇటీవల యూనిట్‌ వెల్లడించింది. ఆర్మీ అధికారిగా చైతూ లుక్‌కి మంచి స్పందన లభించింది. అయితే డెబ్బై ఏళ్ల క్రితం తండ్రి ఏఎన్నార్‌ `బాలరాజు` చిత్రంలో నటించారు. అది ఏఎన్నార్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో ఒకటి. అలాంటి పాత్రలో ఇప్పుడు చైతూ నటించడాన్ని తలచుకుని, ఆ విషయాన్ని ఆమిర్‌తో చెబుతూ ఎమోషనల్‌ అయ్యారట నాగ్‌.

ఏఎన్నార్ న‌టించిన ప్రేమ్ న‌గ‌ర్ చిత్రం విడుద‌లై నేటికి 70 ఏళ్లు అవుతుంది. అయితే ఇదే డేట్‌కి ల‌వ్ స్టోరీ చిత్రం విడుద‌ల కానుండ‌డంతో నాగార్జున చాలా ఎమోష‌న‌ల్ అయిన‌ట్టు తెలుస్తుంది. ల‌వ్ స్టోరీ చిత్రం భారీ సంఖ్య‌లో విడుద‌లై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. వ‌సూళ్లు విష‌యంలోను ల‌వ్ స్టోరీ అద‌ర‌గొడుతుంద‌ని అంటున్నారు.

చైతూ `లాల్‌సింగ్‌ చద్దా`తోపాటు `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు నాగార్జున ప్రస్తుతం `ఘోస్ట్`, `బంగార్రాజు` చిత్రంలో నటిస్తున్నారు. బంగార్రాజు చిత్రంలో చైతూతో క‌లిసి నాగ్ న‌టించ‌నున్నాడు. వీరిద్ద‌రు క‌లిసి సిల్వ‌ర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేస్తాడ‌ని స‌మాచారం.