Nagarjuna : 100వ సినిమా ఎలా వుండాలని నాగార్జున కోరుకుంటున్నారంటే.!
NQ Staff - September 20, 2022 / 08:49 AM IST

Nagarjuna : అక్కినేని నాగార్జున.. ఇప్పటికీ నవ మన్మధుడే. ఆ ప్రస్తావనని ఆయన ఎంజాయ్ చేస్తారు కూడా.! వయసు మీద పడుతున్నా, ఫిట్‌గా వుండడంలో నాగార్జునకు సాటి ఇంకెవరూ రారేమో.! నటుడిగా వందో సినిమాకి దగ్గరయ్యారు నాగార్జున.

Nagarjuna Dream project 100th Movie
ఇంతకీ, నాగార్జున నటించబోయే వందో సినిమా ఎలా వుంటుంది.? ఎలా వుండాలని కింగ్ అక్కినేని నాగార్జున అనుకుంటున్నారు.? చారిత్రక నేపథ్యమా.? ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఇష్టమా.? ఈ ప్రశ్నలకు ఆయన ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో. విజువల్ వండర్ అవ్వాలిగానీ.. ‘బ్రహ్మాస్త్ర’ తరహాలో వుండాలనుకోవడంలేదు.. కాకపోతే, విజువల్ వండర్ అవ్వాలనే ఆలోచన వుంది. అలాగని భారీ బడ్జెట్ సినిమా చేసెయ్యాలనీ లేదు. ‘సీతారామం’ మంచి సినిమా. ‘ఒకే ఒక జీవితం’ కూడా అంతే. ఇవి కూడా ప్రేక్షకులకు చాలా ఏళ్ళపాటు గుర్తుండిపోయే సినిమాలని నాగార్జున చెప్పుకొచ్చారు.
ప్రేక్షకులని థియేటర్లకు రప్పించే సినిమ అయి వుండాలంటూ తన వందో సినిమా విషయమై మనసులో మాటను బయటపెట్టారు అక్కినేని నాగార్జున. ఎవరైనా అలాగే కోరుకుంటారు. ఇంతకీ, నాగార్జున వందో సినిమాకి దర్శకుడెవరు.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.