Nagarjuna : బిగ్‌ బాస్‌ రేటింగ్ తక్కువ వస్తుందని ఒప్పుకున్న నాగ్‌.. ఐనా ఫుల్‌ హ్యాపీ

NQ Staff - October 7, 2022 / 09:11 AM IST

Nagarjuna : బిగ్‌ బాస్‌ రేటింగ్ తక్కువ వస్తుందని ఒప్పుకున్న నాగ్‌.. ఐనా ఫుల్‌ హ్యాపీ

Nagarjuna : తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 కి వచ్చినంత రేటింగ్ మరి సీజన్ కి రాలేదని చెప్పాలి. నాగార్జున బ్యాక్ టు బ్యాక్ సీజన్లకు హోస్టింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం బిగ్బాస్ సీజన్ 6 నడుస్తున్న విషయం తెలిసింది. ఈ సీజన్ సిక్స్ రేటింగ్ విషయంలో తీవ్రమైన నిరుత్సాహంలో స్టార్ మా వాళ్లు ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది.

ఈ సమయంలోనే నాగర్జున రేటింగ్ విషయంలో అసంతృప్తితో ఉన్నాడంటూ పుకార్లు షికార్లు చేయడం మనం చూసాం. తాజాగా నాగార్జున నటించిన ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఉండగా బిగ్ బాస్ షో గురించి టాపిక్ వచ్చింది.

ఆ సమయంలో రేటింగ్ గురించి మీడియా వారు ప్రశ్నించగా ఈ సీజన్ కి రేటింగ్ తక్కువ వస్తుంది అనేది నిజమే.. కానీ వ్యూయర్షిప్ విపరీతంగా పెరిగింది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

గతంతో పోలిస్తే బిగ్ బాస్ ని ఇప్పుడు ఎక్కువ మంది చూస్తున్నారని ఆయన అన్నాడు, అయితే స్టార్ మా లో కాకుండా ఎక్కువ శాతం మంది ఓటీటీ ప్లాట్ఫామ్ పై బిగ్ బాస్ ని చూస్తున్నారని నాగర్జున తెలియజేశాడు.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విపరీతమైన వ్యూవర్షిప్ బిగ్ బాస్ కి వస్తుందని అందుకే స్టార్ మాలో తగ్గిందని ఆయన తెలియజేశాడు. బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి వస్తున్న ఆదరణ నేపథ్యంలో స్టార్ మా ముందు ముందు మరిన్ని కార్యక్రమాలను సీజన్లను చేస్తుందని నమ్మకమును ఆయన వ్యక్తం చేశాడు. రేటింగ్ విషయంలో అసంతృప్తి లేదని నాగార్జున మాటలతో అర్థమవుతుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us