Nagarjuna : అఖిల్‌తో నాగార్జున సినిమా.! ‘ది ఘోస్ట్’ ప్లస్ ‘ఏజెంట్’ అట.!

NQ Staff - September 26, 2022 / 09:07 AM IST

Nagarjuna : అఖిల్‌తో నాగార్జున సినిమా.! ‘ది ఘోస్ట్’ ప్లస్ ‘ఏజెంట్’ అట.!

Nagarjuna : ‘ది ఘోష్ట్’ ప్లస్ ‘ఏజెంట్’ కలిస్తే ఎలా వుంటుంది.? ఈ ప్రశ్న అక్కినేని అభిమానుల్లో కొత్త అంచనాలకు కారణమవుతోంది. నాగార్జున, అఖిల్ కలిసి ఎప్పుడో.. అఖిల్ చిన్నప్పుడే నటించేశారు. ఆ తర్వాత ‘మనం’ సినిమాలోనూ ఇద్దరూ కలిసి నటించారు. అయితే, అందులో అఖిల్ పాత్ర చాలా చిన్నది. ఇక, ‘అఖిల్’ సినిమాలో నాగార్జున ఓ పాటలో కనిపిస్తాడు.

ఫుల్ లెంగ్త్ రోల్‌లో నాగార్జున – నాగచైతన్య నటించారుగానీ, అఖిల్ – నాగార్జున మాత్రం నటించలేదు. ఆ అద్భుతమైన కాంబినేషన్ కోసం అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ అభిమానులు కోరుకుంటోన్న సినిమా త్వరలో రాబోతోందట.
ఆ లెక్క వేరే వుంటది.. అఖిల్‌తో కలిసి సినిమా చేయబోతున్నాను.. అంటూ అక్కినేని నాగార్జున తన తాజా చిత్రం ‘ది ఘోష్ట్’ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రకటించేశారు.

అదే వేదికపై అఖిల్, నాగచైతన్య కూడా వున్నారు. ‘ది ఘోస్ట్’ ప్లస్ ‘ఏజెంట్’.. ఈ రెండూ కలిస్తే ఎలా వుంటుందో అలా తమ కాంబినేషన్‌లో సినిమా వుండబోతోందని నాగార్జున చెప్పుకొచ్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ‘ఏజెంట్’ సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. అనివార్య కారణాల వల్ల ‘ఏజెంట్’ సినిమా విడుదల విషయంలో కొంత ఆలస్యం జరుగుతోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us