Akkineni Nagarjuna: బ‌య‌టప‌డ్డ నాగార్జున అస‌లు రూపం.. నోరెళ్ల‌పెడుతున్న ఫ్యాన్స్

సినీ సెల‌బ్రిటీల అందం వారి మేక‌ప్‌లోనే దాగి ఉంటుంద‌నే విష‌యం అంద‌రికి తెలిసిందే. కొన్ని సార్లు మేక‌ప్ లేకుండా సెల‌బ్స్ బ‌య‌ట అడుగుపెడుతున్న నేప‌థ్యంలో వారిని చూసి అభిమానులు ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌వుతున్నారు. యువ స్టార్స్ విష‌యం ప‌క్క‌న పెడితే మ‌న సీనియ‌ర్ హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌,వెంక‌టేష్‌,రాజ‌శేఖ‌ర్ వంటి వారు ఇంకా వెండితెర‌పై అల‌రిస్తూనే ఉన్నారు.

nagarjuna
nagarjuna

మేక‌ప్ చాటున వారు తమ అందంతో మాయ చేస్తున్నారు. కాని కొన్నిసార్లు మేక‌ప్ లేకుండా క‌నిపించే స‌రికి షాక్ అవుతున్నారు. తాజాగా నాగార్జున ముస‌లోడి లుక్ ఒక‌టి వైర‌ల్‌గా మారింది. వామ్మో మరీ ఇంత ముసలోడు అయిపోయాడా అంటూ కాస్త నాటుగానే మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. నిజాలు మాట్లాడుకుంటే నాగార్జున ఇలాగే ఉంటాడు.. వయసు లెక్కల ప్రకారం చూసుకుంటే ఇలాగే ఉండాలి కూడా. కానీ ఆయన మెయింటనెన్స్ మాత్రం మరోలా ఉంటుంది.

త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న నాగ్ 60 కాకుండా 30ల్లో ఉండేలా కనిపిస్తుంటాడు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఇప్పటికీ మన్మథుడుగా కనిపిస్తుంటాడు నాగార్జున. అందుకే ఈయన వయసు ఎంత అంటే.. నాగార్జున విషయంలో ఏజ్ అనేది నెంబర్ మాత్రమే అంటుంటారు అభిమానులు. కానీ ఇప్పుడు ఆ ఏజ్ లెక్కలు బయటికి వచ్చాయి.

మన్మథుడికి కూడా వయసైపోయింది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు కొత్త ఫోటోలు చూసిన తర్వాత. తాజాగా సోషల్ మీడియాలో ఈయన ఒరిజినల్ ఫోటో ఒకటి బయటికి వచ్చింది. ఓ అమ్మాయితో కలిసి ఉన్న నాగార్జున ఫోటోను చూసి షాక్ అవుతున్నారు అభిమానులు. వామ్మో.. మా మన్మథుడు ఏంటి ఇలా అయిపోయాడు.. ఒరిజినల్ లుక్ ఇలాగే ఉంటుందా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఈ ఫోటో చూసిన తర్వాత ఆయన వయసు బయటికి వచ్చింది. తన వయసుకు తగ్గట్లుగానే కనిపిస్తున్నాడు మన్మథుడు. నెరిసిన జుట్టు, మీసకట్టుతో కనిపించాడు అందులో. మేకప్ లేకుండా ఒరిజినల్ కింగ్ ఇలాగే ఉంటాడు మరి అంటున్నారు నెటిజన్లు. మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారీ కుర్రాడిగా మారిపోయి కనిపిస్తుంటాడు నాగార్జున. ఇప్పటి వరకు 30 అని చెప్పుకున్న నాగార్జునకు ఇప్పుడు అదనంగా మరో 30 కూడా వచ్చేసాయి.

ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు నాగార్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ తో పాటు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్నినాయనా సీక్వెల్ బంగార్రాజు సినిమాలు చేస్తున్నాడు. దాంతో పాటు బాలీవుడ్ మల్టీస్టారర్ బ్రహ్మాస్త్రలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు అక్కినేని అందగాడు.