Nagarjuna: వారం క్రిత‌మే అపాయింట్‌మెంట్ గురించి చిరంజీవి చెప్పారు: నాగార్జున‌

Nagarjuna: ఏపీలో టాలీవుడ్ కు,ప్రభుత్వానికి సినిమా టికెట్ల వివాదం గట్టిగా నడుస్తుంది. ఎవరికి నచ్చినట్టు వారు మాట్లూడుతున్నారు. వివాదం రకరకాల మలుపులు తిరుగుతున్న వేళ.. మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ముఖ్యంమత్రి వైస్ జగన్ ను కలవనున్నారు. ఈ భేటిలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విష‌యాల‌పై చ‌ర్చ సాగ‌నుంది.

Nagarjuna1
Nagarjuna1

ఇండస్ట్రీ నుంచి ఎన్ని ప్రయత్నులు చేసినా.. ఏపీ ప్రభుత్వం బెట్టు వీడటం లేదు. పైగా సినిమా వాళ్లు ఏది మాట్లాడినా దానికి గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు ఏపీ మంత్రులు. అటు ప్రభుత్వ పెద్దలు.. ఇటు టాలీవుడ్ పెద్దలు మాటల వేడితో వివాదం ముదురుతుంది తప్పించి కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి భేటి ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

అయితే దీనిపై నాగార్జున స్పందించారు. వారం క్రిత‌మే అపాయింట్‌మెంట్ గురించి చిరంజీవి చెప్పారు. వెళ్లి రండి ఏదో ఒకటి చేసేసి రండి అని చెప్పా. ఎవరు చేసినా ఇండస్ట్రీ గురించే అని చెప్పాను. ఇక త‌న సినిమా గురించి చెబుతూ మూవీ స్టార్ట్ ఐనప్పుడే ఈ పరిస్థితిని బట్టి బడ్జెట్ వేసుకున్నాం. అన్నపూర్ణకి ఉన్న ఎక్స్పీరియన్స్ తో ఈ రేట్స్ తోనే సేఫ్ అయ్యేలా చేశాం. రేట్స్ వస్తే బోనస్. ఆ జీవో కంటే ముందు స్టార్ట్ అయిన సినిమాలకు మాత్రం ఇబ్బందే అని నాగార్జున అన్నారు.

అంత‌కముందు బంగార్రాజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే స‌మ‌యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లొ మాట్లాడిన నాగార్జున‌.. టికెట్ల రేట్లు ఎక్కువ వుంటే కాస్త ఎక్కువ డబ్బులు వస్తాయని మిగిలిన వారి సంగతి తనకు తెలియదని తనకైతే ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు నాగార్జున. ఏపీలో టికెట్ల రేట్లతో తాను సంతోషంగానే వున్నానని… సినిమా టికెట్ల ధరలు పెరిగితే మంచిదేని ఆయన చెప్పారు. బంగార్రాజు సినిమాను ప్యాకెట్‌లో పెట్టుకొని ఉంచలేమని.. తన సినిమాకు ఎలాంటి సమస్యా లేదని నాగార్జున పేర్కొన్నారు.

Nagarjuna1
Nagarjuna1

కాగా.. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ప్రస్తుత కోవిడ్ పరిస్ధితుల నేపథ్యంలో ఈ మూవీ విడుదల వుంటుందా వుండదా అన్న అనుమానాలకు చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించి క్లారిటీ ఇచ్చింది.