Nagababu’s comments on Surekha : మా వదిన అలాగే చేస్తుంది.. అందుకే ఇంట్లో గొడవలు.. నాగబాబు కామెంట్లు వైరల్..!
NQ Staff - July 22, 2023 / 11:56 AM IST

Nagababu’s comments on Surekha : మెగా ఫ్యామిలీ అంటే కలిసి మెలిసి ఉంటారని అందరికీ తెలిసిందే. చిరంజీవి కారణంగానే ఈ రోజు మెగా ఫ్యామిలీ ఈ స్థాయిలో ఉంది. దాన్ని ఎవరూ కాదనలేరు. అలాంటి చిరంజీవి వల్ల ఎదిగిన మెగా ఫ్యామిలీ నుంచి నేడు ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్ ను శాసించే స్థాయిలో మెగా ఫ్యామిలీ ఉంది.
కాగా మెగా ఫ్యామిలీ ఈ రోజు కలిసి ఉందంటే దానికి కారణం చిరంజీవి భార్య సురేఖ అని చాలామంది అంటుంటారు. ఆమె సర్దుకుని పోవడం వల్లే చిరంజీవి తన తమ్ముళ్లకు ఆర్థికంగా సయం చేస్తుంటారని చెబుతారు. అయితే ఇదే విషయం మీద నాగబాబు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ లో ఓపెన్ అయ్యాడు.
సర్ది చెప్తుంది..
అందరూ అనుకున్నట్టు మా వదిన చాలామంచిది. ఆమె వల్ల మేం ఎంతో లాభపడ్డాం. మా అన్నయ్యకు ఎప్పుడూ ఎదరు చెప్పదు. అంతే కాదు నాకు మా అన్నయ్యకు ఏదైనా విషయంలో గొడవ వస్తే అటు మా అన్నయ్యకు ఇటు నాకు సర్ది చెప్తుంది. అంతే గానీ ఆ గొడవను పెద్దది చేయాలని అనుకోదు.
ఆమె సర్దుకు పోవడం వల్లే మేం ఈ స్థాయిలో ఉన్నాం. మా వదిన చెబితే మా అన్నయ్యకు మాకు ఏదీ పెట్టడు. కానీ ఇంత వరకు ఆమె ఆ మాట అనలేదు. వారికి ఎందుకు పెట్టాలి, మన లైఫ్ మనం చూసుకుందాం అని ఆమె ఏనాడూ అనలేదు. అంతా మనవాళ్లే కా అని అనుకుంటుంది అంటూ తెలిపాడు నాగబాబు.