Nagababu: నోరు విప్పిన నాగ‌బాబు.. పోసానికి, ఏపీ ప్ర‌భుత్వానికి చుర‌క‌లు

Nagababu: ‘రిపబ్లిక్’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపు ఊపేస్తున్నాయి. ఆ రోజు మొదలు ఇప్పటి వరకు జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం భీకరంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. మంత్రులందరూ మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడుతున్నారు . మంత్రులంతా సన్నాసులు అంటూ పవన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు.. మంత్రులు సైతం అంతే ఘాటుగా రిప్లై ఇస్తున్నారు.

Nagababu Response to Posani Krishna Murali Comments
Nagababu Response to Posani Krishna Murali Comments

ప్రభుత్వ నిర్ణయాలు ఆయన దోపిడీకి అడ్డంకిగా మారుతున్నాయి కాబట్టే అంతలా రియాక్ట్ అవుతున్నారంటూ ఫైర్ అయ్యారు. పోసాని కృష్ణ మురళి కూడా రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ని , పవన్ ఫ్యాన్స్ ని విమర్శించారు. దీనిపై జనసేన నాయకులు, మెగా అభిమానులు పోసాని పై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ విష‌యంపై నాగ‌బాబు త‌న వాద‌న వినిపించారు.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నాగ‌బాబు.. తన అభిమానులతో క్వశన్ & ఆన్సర్స్ లోమాట్లాడారు. అభిమానులు పోసాని గురించి, ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో తీసుకున్న నిర్ణయాల గురించి నాగబాబుని అడిగారు. దాంతో పోసాని పై స్పందిస్తూ కుక్క మొరిగింది పట్టించుకోవద్దు అని అన్నారు. అంతే కాకుండా పోసాని గతంలో పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ ఉన్న వీడియోని కూడా పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ గ్రేట్ హీరో తనతో నేనే నిర్మాతగా సినిమా తీస్తా అని పోసాని అన్నారు. పోసాని మాట్లాడినవి పట్టించుకోవనవసరం లేదు అని వ్యాఖ్యలు చేశారు నాగబాబు. ఇక ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల విషయాల్లో తీసుకున్న నిర్ణయాలు దొంగలు సొమ్ము పంచుకున్నట్టు ఉందని ఒక సినీ కామెడీ వీడియో పెట్టి అన్నారు.

పేర్ని నాని పై కూడా విమర్శలు చేశారు. పేర్ని నాని అద్భుతంగా నటిస్తాడని అతనికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు అని వ్యాఖ్యానించారు. అలాగే సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం కూడా మెల్లిగా కుదుట పడుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇవాళ మంగళగిరిలో పర్యటించనున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పవన్ విమర్శలు.. దానికి వైసీపీ నేతల మూకుమ్మడి దాడి నేపథ్యంలో ఈ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.