Naga babu: త‌ప్పు చేస్తే ప్ర‌శ్నించు.. నీచ సంస్కృతికి దిగ‌జారొద్దంటూ నాగ బాబు ఫైర్

Naga babu: టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి పట్ల అసెంబ్లీ సమావేశాల్లో అవమానకరంగా మాట్లాడిన వైసిపి ఎమ్మెల్యేల తీరుపై ప్ర‌తి ఒక్క‌రు గళం విప్పుతున్నారు. వైసీపీ త‌రుని ఎండ‌గ‌డుతున్నారు. తాజాగా నాగ‌బాబు ఓ సుదీర్ఘ పోస్ట్ ద్వారా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు ఎక్కు పెట్టాడు. నీకు ఒకరు చేసింది తప్పు అనిపిస్తే ప్రశ్నించు, నిలదీయు లేదా తప్పు వుంటే కమిటీ వేసి నిరూపించి శిక్షించండి కానీ ఇలాంటి నీచ సంస్కృతీ కి దిగజారకండి అని అన్నాడు.

nagababu fires on jagan2
nagababu fires on jagan2

రాష్ట్ర రాజ‌కీయ చరిత్ర‌లో ఇద ఎంతో దుర్ధినం అంటూ ఎంతో ఉన్న‌త‌మైన‌దిగా మ‌రియు ఉత్త‌మ మైన‌దిగా ప్రాచుర్యం గావించిన రాష్ట్ర రాజ‌కీయ భ‌విష్య‌త్‌ని త‌ల‌చుకొని బాధ‌ప‌డాలో లేక భ‌య‌ప‌డాలో తెలియ‌ని సందిగ్ధ దుస్తితి ఏర్ప‌డింది. చంద్ర‌బాబు గారు మాకు ప్ర‌త్య‌ర్ధి అయి ఉండ‌వ‌చ్చు. తెలుగు దేశం పార్టీ మాకు ప్ర‌తిప‌క్షం అయి ఉండ‌వ‌చ్చు. కాని చంద్ర‌బాబు లాంటి ఒక నేత క‌న్నీటి ప‌ర్యంతం అయిన ఘ‌ట‌న న‌న్ను దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఆంధ్ర రాష్ట్ర రాజ‌కీయం రోజురోజుకి ప‌రాకాష్ట‌ల‌కు నిల‌యంగా మారుతుంది. ఒక ముఖ్య‌మంత్రి భో**డికే అని దూషించి మాజీ ముఖ్య మంత్రి కుటుంబాన్ని అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలంతో కించ‌ప‌రిచి త‌మ‌ను తాము హీనాతి హీన‌మైన విలువ‌లు లేని పురుగులుగా నిరూపించుకుంటున్నారు.

నీకు ఒక‌రిని విమ‌ర్శించే నైతిక హ‌క్కు త‌ప్ప వారిని తిట్టి లేదా కుటుంబాల‌ను దూషించే అధికారం ఏ మాత్ర లేదు. గ‌తంలో నా త‌మ్ముడు ప‌వన్‌ని నా కుటుంబాన్ని ఇలాగే అనుచిత ప‌దాల‌తో విమర్శించిన‌ప్పుడు ఎంతో క్షోభ‌కు గురైన వ్య‌క్తిగా ఆ బాధ‌ను అనుభ‌వించి వ్య‌క్తిగా చెబుతున్నా.ఏ పార్టీ అయిన స‌రే, ఏ నాయ‌కుడైన స‌రే వారి ప‌ట్ల కనీస గౌర‌వాన్ని పాటించి మ‌నుషులుగా మార‌తార‌ని ఆశిస్తున్నా అని నాగ‌బాబు అన్నారు.

nagababu fires on jagan1
nagababu fires on jagan1